-
దేవుని ప్రజలకు ఓదార్పుయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
-
-
12. మానవులైన వ్యతిరేకులు తమను నిందించినప్పుడు దేవుని సేవకులు ఎందుకు భయపడకూడదు?
12 “నీతిని అనుసరించు” వారిని ఉద్దేశించి మాట్లాడుతూ యెహోవా ఇప్పుడు ఇలా చెబుతున్నాడు: “నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును.” (యెషయా 51:7, 8) యెహోవాయందు నమ్మకం ఉంచేవారు తాము తీసుకున్న ధైర్యవంతమైన స్థానాన్ని బట్టి నిందించబడతారు, దూషించబడతారు, కాని దాని గురించి భయపడవలసిన అవసరంలేదు. అలాంటి దూషకులు, చిమ్మట ఉన్ని వస్త్రాలను తినివేసినట్లు, ‘కొరికివేయబడే’ మానవమాత్రులు.a ప్రాచీన కాలంనాటి నమ్మకమైన యూదులవలె, నేడు నిజ క్రైస్తవులు తమను వ్యతిరేకించేవారిని బట్టి భయపడవలసిన అవసరం లేదు. నిత్య దేవుడైన యెహోవాయే వారి రక్షణ. (కీర్తన 37:1, 2) దేవుని శత్రువులు చేసే దూషణ, యెహోవా ప్రజలకు ఆయన ఆత్మ ఉందన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది.—మత్తయి 5:11, 12; 10:24-31.
-
-
దేవుని ప్రజలకు ఓదార్పుయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
-
-
a ఇక్కడ పేర్కొనబడిన చిమ్మట, నేత వస్త్రాలను తినివేసే చిమ్మటనీ, ప్రాముఖ్యంగా నాశనకరమైన డింభక దశలో ఉన్న చిమ్మట అనీ స్పష్టమవుతోంది.
-