-
అష్షూరీయునికి భయపడకండియెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
యెషయా గ్రంథం 10 వ అధ్యాయం ప్రాథమికంగా, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి యెహోవా అష్షూరు దురాక్రమణను ఎలా ఉపయోగిస్తాడనే దానిమీద, యెరూషలేమును కాపాడతానన్న ఆయన వాగ్దానంమీద అవధానాన్ని నిలుపుతుంది. 20 నుండి 23 వరకున్న వచనాలు ఈ ప్రవచనం మధ్య భాగంలో ఉన్నాయి గనుక, అవి అదే కాలంలో సాధారణ నెరవేర్పును కలిగివున్నట్లు దృష్టించవచ్చు. (యెషయా 1:7-9 పోల్చండి.) అయితే ఈ వచనాలు, యెరూషలేము కూడా తన నివాసుల పాపాలకు జవాబు చెప్పవలసి వచ్చే తర్వాతి కాలాలకు ప్రాముఖ్యంగా వర్తిస్తాయని పదాల పొందిక సూచిస్తోంది.
ఆహాజు రాజు సహాయం కోసం అష్షూరువైపు తిరగడం ద్వారా భద్రతను పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇశ్రాయేలు ఇంటివారిలో తప్పించుకున్న వారు భవిష్యత్తులో మళ్లీ ఎన్నడూ అలాంటి మూర్ఖపు చర్యను గైకొనరని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. వారు “ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు” అని యెషయా 10:20 చెబుతోంది. అయితే, కేవలం కొద్దిమంది మాత్రమే అలా చేస్తారనీ, అంటే “శేషము తిరుగును [“ఒక శేషము మాత్రమే తిరిగివచ్చును,” NW]” అని 21 వ వచనం చూపిస్తోంది. ఇది మనకు యెషయా కుమారుడైన షెయార్యాషూబును జ్ఞప్తికి తెస్తోంది, అతడు ఇశ్రాయేలులో ఒక సూచనగా ఉన్నాడు, అతని పేరుకు “శేషము మాత్రమే తిరిగి వచ్చును” అని భావం. (యెషయా 7:3) నిర్ణయించబడిన “సమూలనాశనము” రావడాన్ని గురించి 10 వ అధ్యాయం 22 వ వచనం హెచ్చరిస్తుంది. అలాంటి సమూలనాశనం నీతియుక్తమైనదై ఉంటుంది, ఎందుకంటే అది తిరుగుబాటు దారులైన ప్రజలపై న్యాయవంతమైన శిక్షయై ఉంటుంది. ఫలితంగా, “సముద్రపు ఇసుకవలె” అసంఖ్యాకంగా ఉన్న జనుల నుండి కేవలం ఒక శేషము మాత్రమే తిరిగివస్తుంది. రానున్న ఈ సమూలనాశనం మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తుందని 23 వ వచనం హెచ్చరిస్తుంది. ఈసారి యెరూషలేము తప్పించుకోలేదు.
-
-
అష్షూరీయునికి భయపడకండియెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
రోమీయులు 9:27, 28 వచనాల్లో చూపించబడినట్లుగా, యెషయా 10:20-23 వచనాల్లోని ప్రవచనం మొదటి శతాబ్దంలో మరొకసారి నెరవేరింది. (యెషయా 1:9; రోమీయులు 9:29 పోల్చండి.) ఆధ్యాత్మిక భావంలో, యూదుల ఒక “శేషము” సా. శ. మొదటి శతాబ్దంలో యెహోవా వద్దకు ‘తిరిగివచ్చిందనీ’ అంటే చాలాకొద్ది సంఖ్యలో నమ్మకమైన యూదులు యేసు క్రీస్తు అనుచరులై యెహోవాను “ఆత్మతో సత్యముతో” ఆరాధించడం మొదలుపెట్టారనీ పౌలు వివరిస్తున్నాడు. (యోహాను 4:24) విశ్వసిస్తున్న అన్యులు తర్వాత వీరితో కలవడంతో, “దేవుని ఇశ్రాయేలు” అయిన ఆధ్యాత్మిక జనాంగం రూపొందింది. (గలతీయులు 6:16) ఈ సందర్భంలో యెషయా 10:20 లోని మాటలు నెరవేరాయి: యెహోవాకు సమర్పించుకున్న జనాంగం, ఆయన నుండి వైదొలగి మద్దతు కోసం మానవ శక్తులను “ఇకను” ఆశ్రయింపదు.
-