-
పరదైసు పునఃస్థాపించబడింది!యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
20. సా.శ. మొదటి శతాబ్దంలో ఏ క్రొత్త ఇశ్రాయేలు ఉనికిలోకి వచ్చింది?
20 యెహోవా నిర్ణీత సమయంలో, మరో ఇశ్రాయేలు అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు ఉనికిలోకి వచ్చింది. (గలతీయులు 6:16) యేసు తన భూపరిచర్య సమయంలో ఈ క్రొత్త ఇశ్రాయేలు జననానికి రంగాన్ని సిద్ధం చేశాడు. ఆయన స్వచ్ఛారాధనను పునఃస్థాపించాడు, ఆయన బోధలతో సత్య జలాలు మళ్లీ ప్రవహించడం మొదలుపెట్టాయి. ఆయన శారీరక, ఆధ్యాత్మిక రోగులను స్వస్థపరిచాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుండగా ఆనందభరితమైన పాట అంతటా వ్యాపించింది. ఆయన మరణ పునరుత్థానాల తర్వాత ఏడు వారాలకు, మహిమపర్చబడిన యేసు క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘమే, యేసు చిందించిన రక్తంతో విమోచింపబడి, దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా యేసు సహోదరులుగా జన్మించి, పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన యూదులతోనూ మరితరులతోనూ రూపొందించబడిన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు.—అపొస్తలుల కార్యములు 2:1-4; రోమీయులు 8:16, 17; 1 పేతురు 1:18, 19.
21. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి సంబంధించి, యెషయా ప్రవచనంలోని నిర్దిష్ట అంశాల నెరవేర్పుగా ఏ సంఘటనలను దృష్టించవచ్చు?
21 అపొస్తలుడైన పౌలు ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని సభ్యులకు వ్రాసేటప్పుడు, “వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి” అని చెబుతూ, యెషయా 35:3 లోని మాటలను పేర్కొన్నాడు. (హెబ్రీయులు 12:12) కాబట్టి, సా.శ. మొదటి శతాబ్దంలో యెషయా 35 వ అధ్యాయంలోని మాటలు నెరవేరాయని స్పష్టమవుతోంది. అక్షరార్థ భావంలో, యేసు ఆయన శిష్యులు అద్భుతరీతిగా గ్రుడ్డివారికి చూపును, చెవిటివారికి వినికిడి శక్తిని ఇచ్చారు. వారు “కుంటివారు” నడిచేలా, మూగవారు తిరిగి మాట్లాడగలిగేలా చేశారు. (మత్తయి 9:32; 11:5; లూకా 10:9) మరింత ప్రాముఖ్యంగా, యథార్థ హృదయులు అబద్ధ మతాన్ని తప్పించుకొని, క్రైస్తవ సంఘంలో ఆధ్యాత్మిక పరదైసును ఆనందించడం మొదలు పెట్టారు. (యెషయా 52:11; 2 కొరింథీయులు 6:16-18) బబులోను నుండి తిరిగి వచ్చిన యూదుల వలెనే, తప్పించుకొనిన వీరు, సునిశ్చితమైన, ధైర్యవంతమైన స్ఫూర్తి అత్యావశ్యకమని తెలుసుకున్నారు.—రోమీయులు 12:11.
-
-
పరదైసు పునఃస్థాపించబడింది!యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
23, 24. యెషయా మాటలు, 1919 నుండి దేవుని ప్రజల మధ్యన ఏ యే విధాలుగా నెరవేరాయి?
23 అయితే, 1919 లో, పరిస్థితులు మారాయి. యెహోవా తన ప్రజలను చెరలో నుండి విడిపించాడు. తమ ఆరాధనను మునుపు కలుషితం చేసిన అబద్ధ బోధలను వారు తిరస్కరించడం మొదలు పెట్టారు. ఫలితంగా, వారు స్వస్థతను పొందారు. వారు ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించారు, ఆ ఆధ్యాత్మిక పరదైసు ఈనాటికీ భూవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. దేవుని పరిశుద్ధాత్మ పనిచేసే తీరు గురించి పూర్తిగా గ్రహించి, యెహోవాకు సన్నిహితంగా ఉండాలనే అవసరతను ఎల్లవేళలా గుర్తెరిగినవారై, ఆధ్యాత్మిక భావంలో, గ్రుడ్డివారు చూడడమూ చెవిటివారు వినడమూ నేర్చుకుంటున్నారు. (1 థెస్సలొనీకయులు 5:6; 2 తిమోతి 4:5) ఇక మూగవారిగా ఉండక, నిజ క్రైస్తవులు “కంఠం ఎత్తి” ఇతరులకు బైబిలు సత్యాలను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నారు. (రోమీయులు 1:15) ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉండిన వారు లేక ‘కుంటివారు’ ఇప్పుడు అత్యంతాసక్తిని, ఆనందాన్ని కనబరుస్తున్నారు. అలంకారికంగా, వారు ‘దుప్పివలె గంతులువేయ’ గలుగుతున్నారు.
-
-
పరదైసు పునఃస్థాపించబడింది!యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
25. యెషయా 35 వ అధ్యాయానికి భౌతిక నెరవేర్పు ఉంటుందా? వివరించండి.
25 భవిష్యత్తు మాటేమిటి? యెషయా ప్రవచనం ఎప్పటికైనా భౌతిక భావంలో నెరవేరుతుందా? నెరవేరుతుంది. మొదటి శతాబ్దంలో యేసు, ఆయన అపొస్తలులు చేసిన అద్భుత స్వస్థతలు, భవిష్యత్తులో భారీ ఎత్తున అలాంటి స్వస్థతలు చేయగల యెహోవా సామర్థ్యాన్ని, చేయాలని ఆయనకున్న కోరికను చూపించాయి. ప్రేరేపిత కీర్తనలు భూమిపై సమాధానకరమైన పరిస్థితుల్లో నిత్యజీవాన్ని గురించి మాట్లాడతాయి. (కీర్తన 37:9, 11, 29) యేసు, పరదైసులో జీవితం గురించి వాగ్దానం చేశాడు. (లూకా 23:43) బైబిలు దాని మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకూ, ఒక అక్షరార్థ పరదైసును గురించిన నిరీక్షణను ఇస్తుంది. ఆ సమయంలో, గ్రుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు శారీరకంగా, శాశ్వతంగా స్వస్థపరచబడతారు. దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి. నిజానికి, ఆనందం నిత్యం, చివరికి నిరంతరం ఉంటుంది.—ప్రకటన 7:9, 16, 17; 21:3, 4.
-