కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మీపట్ల శ్రద్ధవున్న కాపరి
    కావలికోట—2008 | ఏప్రిల్‌ 1
    • గొర్రెలను శ్రద్ధగా చూసుకునే గొర్రెల కాపరిని ఉదాహరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబది​తొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.” (మత్తయి 18:11-14) యెహోవా తన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరిపట్ల చూపించే వాత్సల్యపూరిత శ్రద్ధను యేసు ఇక్కడ ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం.

  • మీపట్ల శ్రద్ధవున్న కాపరి
    కావలికోట—2008 | ఏప్రిల్‌ 1
    • ఆ దృష్టాంతాన్ని వివరిస్తూ యేసు, ‘ఈ చిన్నవారిలో ఒకడైనను నశించడం’ దేవునికి ఇష్టం లేదని చెప్పాడు. అంతకుముందు ఒకసారి యేసు, “[తన] యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచే” విషయంలో తన శిష్యులను హెచ్చరించాడు. (మత్తయి 18:⁠6) అయితే యేసు చెప్పిన ఆ దృష్టాంతం యెహోవా గురించి మనకేమి తెలియజేస్తోంది? యెహోవా ‘చిన్నవారిపట్ల’ అంటే లోకం దృష్టిలో అల్పులుగా ఉన్న తన గొర్రెలన్నిటిపట్ల ఎంతో శ్రద్ధ చూపించే కాపరిగా ఉన్నాడు. తనను ఆరాధించే ప్రతీ ఒక్కరూ దేవుని దృష్టిలో నిజంగా విశేషమైనవారే, విలువైనవారే.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి