కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
    కావలికోట—1994 | జూలై 15
    • “మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.”—మత్తయి 18:15-17.

  • విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
    కావలికోట—1994 | జూలై 15
    • అయితే, మొదటి చర్యే సరిపోకపోవచ్చు. ఆ పరిస్థితితో వ్యవహరించడానికి, యేసు ఇలా చెప్పాడు: “ఒకరిద్దరిని వెంటబెట్టుకొని . . . పొమ్ము.” వీరు ప్రత్యక్షసాక్షులై ఉండవచ్చు. బహుశా వారు ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కొండెములు చెప్పడం వినివుండవచ్చు, లేక ఇప్పుడు సమ్మతించని ఇరు వర్గాలవారిని గూర్చిన వ్రాతపూర్వక ఒప్పందానికి వారు సాక్షులుగా ఉండి ఉండవచ్చు. అంతేగాక, సమస్యకు కారణాన్ని నిర్ధారించడానికి వ్రాతపూర్వక లేక మౌఖిక సాక్ష్యాన్ని పెంపొందింపజేయడానికి తీసుకొనిపోబడిన వారు సాక్షులు కాగలుగుతారు. మళ్లీ ఇక్కడ కూడా, వీలైనంత చిన్న సంఖ్య అంటే “ఒకరు లేక ఇద్దరు” సమస్య గురించి తెలుసుకోవాలి. విషయం కేవలం ఒక అపార్థం మాత్రమే అయితే పరిస్థితి ఇంకా దిగజారిపోకుండా ఇది కాపాడుతుంది.

      గాయపర్చబడిన వ్యక్తి ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలి? తన తోటి క్రైస్తవున్ని అవమానించ ప్రయత్నించాలా, అతడు తన్ను తానే కించపర్చుకోవాలని ఆశించాలా? యేసు ఉపదేశానుసారంగా, తమ సహోదరులను నిందించడానికి క్రైస్తవులు తొందరపడ కూడదు. తప్పుచేసిన వ్యక్తి తన తప్పును గుర్తించి, క్షమాపణ చెప్పి, విషయాన్ని సరి చేసుకోడానికి ప్రయత్నిస్తే, ఎవరి యెడల తప్పిదము చేయబడిందో అతడు తన ‘సహోదరున్ని సంపాదించుకున్నట్లే’ అవుతుంది.—మత్తయి 18:15.

  • విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
    కావలికోట—1994 | జూలై 15
    • పశ్చాత్తాపము చెందని తప్పిదస్థుడు సంఘము నుండి వెలివేయబడగల సాధ్యత మత్తయి 18:15-17 చిన్న విభేదాలకు వర్తించదని చూపిస్తున్నది. గంభీరమైన తప్పులను ఉద్దేశించి యేసు చెబుతున్నాడు, అయినా కేవలం సంబంధిత ఇద్దరు వ్యక్తుల మధ్య పరిష్కరించబడేదై ఉండాలి. ఉదాహరణకు, ఆ తప్పు బాధితుని పేరు ప్రతిష్ఠలకు గంభీరమైన దెబ్బను కలుగజేసే కొండెములు చెప్పడం అయివుండవచ్చు. లేక తరువాతి వచనాలలో గొప్ప అప్పు క్షమించబడిన దయలేని సేవకుని గురించి చెబుతున్నట్లు అది ఆర్థిక విషయాలకు సంబంధించినది కావచ్చు. (మత్తయి 18:23-35) చెప్పబడిన సమయంలో తిరిగి కట్టని అప్పు కూడా పెద్ద కష్టం కావచ్చు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య సుళువుగా పరిష్కరించబడవచ్చు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ అప్పును తిరిగి కట్టడానికి నిరాకరిస్తే, అది గంభీరమైన పాపం అంటే దొంగతనం, అవుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి