కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట—1997 | డిసెంబరు 1
    • 1. (ఎ) మనం ఇతరులను ‘ఏడుమారులమట్టుకు’ క్షమించాలని పేతురు సూచించినప్పుడు తాను ఔదార్యంతో ప్రవర్తిస్తున్నట్లు ఆయన ఎందుకు భావించివుండవచ్చు? (బి) మనం ‘డెబ్బది ఏడు మారులమట్టుకు’ క్షమించాలని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమిటి?

      “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” (మత్తయి 18:21) అలా సూచించడంలో తాను ఎంతో ఔదార్యంతో ప్రవర్తిస్తున్నట్లు పేతురు భావించి ఉండవచ్చు. ఆ కాలంలో, ఒకే అపరాధానికి మూడుకన్నా ఎక్కువసార్లు క్షమించకూడదని రబ్బీల సాంప్రదాయం చెబుతుంది.a అందుకని, “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను” అని యేసు అన్నప్పుడు పేతురు ఉలికిపాటును మీరు ఊహించండి! (మత్తయి 18:22) ఏడును రెండుమారులు తిరిగిచెప్పడం, “నిరవధికంగా” అని చెప్పడంతో సమానం. యేసు దృష్టిలో, ఇతరులను ఎన్నిసార్లు క్షమించాలన్నదానికి అసలు పరిమితిలేదు.

  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట—1997 | డిసెంబరు 1
    • a బాబిలోన్‌ టాల్ముడ్‌ ప్రకారం రబ్బీల సంప్రదాయం ఇలా చెబుతుంది: “ఒక వ్యక్తి అతిక్రమం చేస్తే, మొదటిసారి, రెండవసారి మూడవసారి అతనిని క్షమించవచ్చు, నాలుగవసారి ఆయనకు క్షమాపణ దొరకదు.” (యోమా 86బి) ఇది కొంతమేరకు ఆమోసు 1:3; 2:6; యోబు 33:29 వంటి వచనాలను తప్పుగా అర్థం చేసుకోవడం మూలాన సంభవించింది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి