-
ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుటకావలికోట—1995 | నవంబరు 1
-
-
11. (ఎ) హీ జీ·ని·యాʹ హౌʹటెను ఎలా అన్వయించాలి అనే విషయాన్ని ఏ అధికారిక గ్రంథమూలం ప్రాథమికంగా నడిపించాలి? (బి) ఈ అధికారిక గ్రంథమూలం ఆ పదాన్ని ఎలా ఉపయోగించింది?
11 నిజమే, ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న క్రైస్తవులు, యేసు మాటలను నివేదిస్తు హీ జీ·ని·యాʹ హౌʹటె అనే గ్రీకు పదాన్ని లేక “ఈ తరము”ను ప్రేరేపిత సువార్త రచయితలు ఎలా ఉపయోగించారు అనే దాన్ని బట్టే ప్రాథమికంగా తమ ఆలోచనా విధానాన్ని నడిపిస్తారు. ఆ పదం ఎడతెగక ప్రతికూలమైన విధానంలో ఉపయోగించబడింది. అందుకని, యూదా మత నాయకులను యేసు “సర్పములారా, సర్పసంతానమా” అని పిలుస్తూ “ఈ తరము” వారిపై గెహెన్నా తీర్పు అమలు చేయబడుతుందని చెప్పాడు. (మత్తయి 23:33, 36) అయితే, ఈ తీర్పు వేషధారులైన మత నాయకులకు మాత్రమేనా? ఎంత మాత్రం కాదు. అనేక సందర్భాల్లో, “ఈ తరము” అనే పదాన్ని ఎంతో విస్తృత భావంలో అన్వయిస్తూ దాని గురించి యేసు మాట్లాడటం ఆయన శిష్యులు విన్నారు. అది ఏమిటి?
-
-
ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుటకావలికోట—1995 | నవంబరు 1
-
-
13. తన శిష్యుల సమక్షంలో, “యీ దుష్టతరము” అని యేసు ఎవరిని గుర్తించి, ఖండించాడు?
13 యేసు ఆయన శిష్యులు గలిలయకు తమ రెండవ ప్రచారయాత్ర చేయబోతుండగా సా.శ. 31 చివరి భాగంలో, “శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు” యేసును సూచకక్రియ కొరకు అడిగారు. ఆయన వారికి, అక్కడ ఉన్న “జనసమూహముల”కు ఇలా చెప్పాడు: “వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచకక్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. . . . ఆలాగే యీ దుష్టతరమువారికిని” సంభవించును. (మత్తయి 12:38-46) “యీ దుష్టతరము”లో, యేసు మరణం మరియు పునరుత్థానము విషయంలో నెరవేరిన సూచనను ఎన్నడూ అర్థం చేసుకొనని మత నాయకులు, “జనసమూహములు” కూడా ఇమిడి ఉన్నారు.d
-