కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన
    యేసే మార్గం, సత్యం, జీవం
    • ఒలీవ చెట్లు ఉన్న ఆ ప్రశాంతమైన ప్రదేశానికి రాగానే, ఎనిమిదిమంది అపొస్తలుల్ని విడిచి యేసు కాస్త ముందుకు వెళ్లాడు. బహుశా వాళ్లు ఆ తోట ద్వారం దగ్గరే ఉండివుండవచ్చు. ఎందుకంటే ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి.” తర్వాత ముగ్గురు అపొస్తలుల్ని అంటే పేతురును, యాకోబును, యోహానును తనతోపాటు తోట లోపలికి తీసుకెళ్లాడు. ఆయన తీవ్రంగా ఆందోళనపడుతూ ఆ ముగ్గురికి ఇలా చెప్పాడు: “నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండి, నాతో పాటు మెలకువగా ఉండండి.”—మత్తయి 26:36-38.

  • యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన
    యేసే మార్గం, సత్యం, జీవం
    • రోమన్లు మరణశిక్ష విధించేటప్పుడు ఎంత చిత్రవధ చేస్తారో యేసు పరలోకం నుండి చూశాడు. అయితే, ఇప్పుడు ఆయన ఒక మనిషిగా భూమ్మీద ఉన్నాడు కాబట్టి ఆయనకు నొప్పి, బాధ, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు ఉన్నాయి. అయినప్పటికీ, తనను ఎలా చంపుతారోనని ఆయన భయపడట్లేదు గానీ, తాను ఒక నేరస్తునిలా చనిపోవడం వల్ల తన తండ్రి పేరుకు ఎక్కడ అపకీర్తి వస్తుందోనని భయపడుతున్నాడు. దైవదూషణ చేసినవాళ్లను కొయ్య మీద వేలాడదీసి చంపినట్లు, ఇంకొన్ని గంటల్లో ఈయన్ని కూడా చంపేస్తారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి