-
మెస్సీయ పరిపాలన క్రింద రక్షణ, ఆనందంయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
4, 5. మెస్సీయ రాక గురించి యెషయా ఏమి ప్రవచించాడు, యెషయా ఉపయోగించిన పదాలను మత్తయి ఎలా అన్వయించి ఉండవచ్చు?
4 యెషయా కాలానికి శతాబ్దాల పూర్వం, ఇతర హీబ్రూ బైబిలు రచయితలు యెహోవా ఇశ్రాయేలుకు పంపించే నిజమైన నాయకుడైన మెస్సీయ రాకను సూచించారు. (ఆదికాండము 49:10; ద్వితీయోపదేశకాండము 18:18; కీర్తన 118:22, 26) ఇప్పుడు యెషయా ద్వారా యెహోవా మరిన్ని వివరాలను అందజేస్తున్నాడు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును; వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.” (యెషయా 11:1; కీర్తన 132:11 పోల్చండి.) “చిగురు,” “అంకురము,” ఈ రెండూ కూడా మెస్సీయ, ఇశ్రాయేలుకు రాజుగా తైలముతో అభిషేకించబడిన దావీదు ద్వారా వచ్చే, యెష్షయి వంశీయుడై ఉంటాడని సూచిస్తున్నాయి. (1 సమూయేలు 16:13; యిర్మీయా 23:5; ప్రకటన 22:16) నిజమైన మెస్సీయ వచ్చినప్పుడు, దావీదు కుటుంబానికి చెందిన ఈ “అంకురము” మంచి ఫలాలను ఫలిస్తుంది.
5 వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసు. ఆయన ‘నజరేయుడు’ అని పిలువబడడం ప్రవక్తలు చెప్పినదాన్ని నెరవేర్చిందని సువార్త రచయిత మత్తయి చెప్పినప్పుడు ఆయన యెషయా 11:1 లోని పదాలనే పరోక్షంగా సూచించాడు. యేసు నజరేతనే పట్టణంలో పెరిగాడు గనుక ఆయన నజరేయుడని పిలువబడ్డాడు, ఆ పేరు యెషయా 11:1 లోని “అంకురము” అనేదాని కోసం ఉపయోగించబడిన హీబ్రూ పదానికి సంబంధించినదై ఉండవచ్చు.b—మత్తయి 2:22, 23; లూకా 2:39, 40.
-
-
మెస్సీయ పరిపాలన క్రింద రక్షణ, ఆనందంయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
b “అంకురము” అనే పదానికి హీబ్రూ పదం నెత్సర్, ‘నజరేయుడు’ అనే పదానికి హీబ్రూ పదం నాత్స్రీ.
-