-
హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడుయేసే మార్గం, సత్యం, జీవం
-
-
అవును, యేసు అనుచరులకు తీవ్రమైన హింస ఎదురవ్వవచ్చు. కానీ ఆయన వాళ్లకు ఇలా ధైర్యం చెప్పాడు: “వాళ్లు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని ఆందోళన పడకండి; మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ అంతట మీరే మాట్లాడరు కానీ, మీ తండ్రి ఇచ్చే పవిత్రశక్తి సహాయంతో మాట్లాడతారు. అంతేకాదు, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వాళ్లను చంపిస్తారు. మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.”—మత్తయి 10:19-22.
-
-
హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడుయేసే మార్గం, సత్యం, జీవం
-
-
యేసు తన 12 మంది అపొస్తలులకు ఎంత చక్కని నిర్దేశాలు, హెచ్చరికలు, ప్రోత్సాహం ఇచ్చాడో కదా! అయితే యేసు చనిపోయి, పునరుత్థానమైన తర్వాత ప్రకటనా పనిలో పాల్గొనేవాళ్లకు కూడా అవి వర్తిస్తాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? తన శిష్యుల్ని ‘ప్రజలందరూ ద్వేషిస్తారు’ అని యేసు అన్నాడు. కాబట్టి అపొస్తలులు ఎవరికైతే ప్రకటిస్తారో వాళ్లు మాత్రమే కాదుగానీ, ప్రపంచంలోని ప్రజలందరూ ద్వేషిస్తారని అర్థమౌతుంది. అంతేకాదు, అపొస్తలులు గలిలయలో ప్రకటించిన ఆ కొద్ది సమయంలో, వాళ్లు అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకురాబడడం గానీ, వాళ్ల కుటుంబ సభ్యులు వాళ్లను మరణానికి అప్పగించడం గానీ జరగలేదు.
కాబట్టి యేసు, భవిష్యత్తును మనసులో ఉంచుకునే అపొస్తలులకు ఆ విషయాలు చెప్పాడని అర్థమౌతుంది. “మీ పని పూర్తి చేసేలోపే మానవ కుమారుడు వస్తాడు” అని యేసు తన శిష్యులతో అన్న మాటల గురించి ఆలోచించండి. మహిమాన్విత రాజైన యేసుక్రీస్తు దేవుని న్యాయాధిపతిగా వచ్చేలోపు, రాజ్యం గురించి ప్రకటించడం పూర్తవ్వదని ఆయన సూచిస్తున్నాడు.
-