కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు
    కావలికోట—2005 | ఆగస్టు 1
    • 6 తన అపొస్తలులు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదో గ్రహించడానికి వారికి సహాయం చేస్తూ యేసు రెండు ఉపమానాలు చెప్పాడు. ఆయన వారితో ఇలా అన్నాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:29-31) కష్టాలొచ్చినప్పుడు భయపడకుండా ఉండడానికి, యెహోవా మనపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో ఉండడానికి యేసు ముడిపెట్టడాన్ని గమనించండి. అపొస్తలుడైన పౌలుకు అలాంటి నమ్మకముందని స్పష్టమవుతోంది. ఆయన ఇలా వ్రాశాడు: “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమీయులు 8:31, 32) కాబట్టి మీరు కూడా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, యెహోవాపట్ల యథార్థంగా ఉన్నంతకాలం ఆయన మీపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. యేసు తన అపొస్తలులకు ఇచ్చిన హెచ్చరికను మనం మరింత జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇది మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

  • యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు
    కావలికోట—2005 | ఆగస్టు 1
    • 10. “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి” అనే మాటలకున్న విశేషత ఏమిటి?

      10 పిచ్చుకల ఉపమానంతోపాటు యేసు ఇంకా ఇలా చెప్పాడు: “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి.” (మత్తయి 10:30) క్లుప్తంగా ఉన్నా శక్తిమంతమైన ఈ మాటలు యేసు చెప్పిన పిచ్చుకల ఉపమానంలోని అంశాన్ని మరింత వివరిస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి: సగటు మనిషి తలమీద దాదాపు 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. చాలావరకు వెంట్రుకలన్నీ ఒకేలా ఉంటాయి, విడి విడిగా ఏ ఒక్క వెంట్రుకకు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదన్నట్లుగా అవి కనిపిస్తాయి. అయినప్పటికీ, యెహోవా దేవుడు ప్రతీ వెంట్రుకను గమనించి దాన్ని లెక్కిస్తాడు. కాబట్టి యెహోవా తెలుసుకోలేని, మన జీవితంలోని వివరమేమైనా ఉందా? నిశ్చయంగా యెహోవా తన సేవకుల్లో ప్రతీ వ్యక్తికి సంబంధించిన విశిష్టమైన నిర్మాణాన్ని అర్థం చేసుకుంటాడు. అవును, ఆయన ‘హృదయాన్ని లక్ష్యపెడతాడు.’​—1 సమూయేలు 16:7.

      11. దావీదు తనపట్ల యెహోవాకున్న శ్రద్ధ విషయంలో తన నమ్మకాన్ని ఎలా వ్యక్తపరిచాడు?

      11 ఎన్నో కష్టాలనుభవించిన దావీదు యెహోవాకు తనమీద శ్రద్ధ ఉందనే నమ్మకాన్ని ప్రదర్శించాడు. “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు” అని ఆయన వ్రాశాడు. (కీర్తన 139:1, 2) మీరు కూడా, యెహోవాకు మీరు వ్యక్తిగతంగా తెలుసనే నమ్మకంతో ఉండవచ్చు. (యిర్మీయా 17:10) అన్నింటినీ చూడగల యెహోవా దృష్టికి మీరు అత్యల్పులని తలస్తూ తొందరపడి ఓ నిర్ణయానికి రాకండి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి