-
సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
2. బాప్తిస్మం తీసుకున్న తన సాక్షులకు యెహోవా ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు?
మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, సంతోషకరమైన యెహోవా కుటుంబంలో ఒకరౌతారు. అప్పుడు ఆయన ప్రేమను మీరు ఎన్నో విధాలుగా రుచి చూస్తారు. అంతేకాదు, మీరు ఆయనకు ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ దగ్గరౌతారు. (మలాకీ 3:16-18 చదవండి.) యెహోవా మీకు తండ్రిగా ఉంటాడు. యెహోవాను, మిమ్మల్ని ప్రేమించే ప్రపంచవ్యాప్త సహోదర సహోదరీల కుటుంబం కూడా మీకు ఉంటుంది. (మార్కు 10:29, 30 చదవండి.) అయితే, మీరు బాప్తిస్మం తీసుకునే ముందు కొన్ని పనులు చేయాలి. మీరు యెహోవా గురించి నేర్చుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన కుమారుడి మీద విశ్వాసం ఉంచాలి. చివరిగా, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఇలా మీరు ఒక్కో అడుగు వేస్తూ బాప్తిస్మం అనే లక్ష్యాన్ని చేరుకుంటే, శాశ్వత జీవితానికి నడిపించే దారిలో ఉన్నట్టే. బైబిలు ఇలా చెప్తుంది: “బాప్తిస్మం . . . మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.”—1 పేతురు 3:21.
-
-
మీరు హింసను సహించగలరు!ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
-
-
యెహోవాను ఆరాధించాలని మనం తీసుకున్న నిర్ణయాన్ని మన ఇంట్లోవాళ్లు ఇష్టపడకపోవచ్చు అని యేసు చెప్పాడు. మత్తయి 10:34-36 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మనం యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇంట్లోవాళ్లు ఏం చేసే అవకాశం ఉంది?
ఉదాహరణకు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
మీ కుటుంబం లేదా స్నేహితులు యెహోవా సేవ చేయకుండా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తే, మీరేం చేస్తారు?
కీర్తన 27:10; మార్కు 10:29, 30 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:
కుటుంబం లేదా స్నేహితుల నుండి వ్యతిరేకత ఎదురైతే, బైబిలు ఇస్తున్న ఈ మాట మీకు ఎలా సహాయం చేస్తుంది?
-