కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు
    కావలికోట—2006 | డిసెంబరు 15
    • 11. తండ్రి కుమారుల ఉపమానాన్ని యేసు ప్రార్థనకు ఎలా అన్వయించాడు?

      11 పట్టుదల చూపించిన అతిథేయిని గురించిన యేసు ఉపమానం, ప్రార్థించే వ్యక్తి అంటే విశ్వాసి యొక్క మనోవైఖరిని నొక్కిచెప్పింది. తర్వాతి ఉపమానం ప్రార్థన ఆలకించే యెహోవా దేవుని మనోవైఖరిని నొక్కిచెబుతోంది. యేసు ఇలా అడిగాడు: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా? గుడ్డు నడిగితే తేలు నిచ్చునా?” యేసు దాని అన్యయింపును కొనసాగిస్తూ ఇలా అన్నాడు: “కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”​—లూకా 11:11-13.

      12. తండ్రి తన కుమారుడు అడిగింది ఇస్తాడనే ఉపమానం యెహోవా మన ప్రార్థనలకు స్పందించేందుకు సుముఖంగా ఉన్నాడని ఎలా నొక్కిచెబుతోంది?

      12 కుమారుడు అడిగినప్పుడు తండ్రి స్పందించడం గురించిన ఈ ఉదాహరణ ద్వారా, తనకు ప్రార్థించేవారిపట్ల యెహోవా మనోభావమెలా ఉంటుందో యేసు బయల్పరిచాడు. (లూకా 10:22) మొదట, ఈ రెండు ఉపమానాలకు మధ్యవున్న తారతమ్యాన్ని గమనించండి. మొదటి ఉపమానంలో సహాయం అడిగిన వ్యక్తికి సహాయం చేసేందుకు ముందుకురాని వ్యక్తికి భిన్నంగా, యెహోవా తన పిల్లవాడు అడిగింది ఇచ్చేందుకు సుముఖంగా ఉండే ప్రేమగల మానవ తండ్రిలా ఉన్నాడు. (కీర్తన 50:15) మానవ తండ్రికి పరలోకపు తండ్రికి మధ్యవున్న తేడాను పేర్కొంటూ మనపట్ల యెహోవాకున్న సుముఖతను యేసు మరింతగా వెల్లడిచేశాడు. మానవతండ్రి వారసత్వ పాపం కారణంగా ‘చెడ్డవాడైనా’ తన కుమారునికి మంచి ఈవినిస్తూ ఉంటే, దయాళుడైన మన పరలోకపు తండ్రి తన ఆరాధకుల కుటుంబానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని మనమెంతగా ఆశించవచ్చో కదా అని ఆయనన్నాడు.​—యాకోబు 1:17.

  • యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు
    కావలికోట—2006 | డిసెంబరు 15
    • 14. పరీక్షలు ఎదుర్కొనే కొందరిని సరికాని ఏ తలంపు బాధిస్తుంది? (బి) పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మనం ధైర్యంగా యెహోవాకు ఎందుకు ప్రార్థించవచ్చు?

      14 శ్రద్ధ చూపించే తండ్రిని గురించి యేసు చెప్పిన ఉపమానం, ఏ మానవ తండ్రి మంచితనంకన్నా యెహోవా మంచితనం మరెంతో గొప్పదని కూడా నొక్కిచెబుతోంది. కాబట్టి, మనకు పరీక్షలు ఎదురైనప్పుడు అవి మనమీద దేవునికున్న కోపం కారణంగానే వస్తున్నాయని మనలో ఎవరూ భావించకూడదు. మనమలా ఆలోచించాలని మన ప్రధాన శత్రువైన సాతాను ఆశిస్తాడు. (యోబు 4:1, 7, 8; యోహాను 8:44) అలాంటి స్వీయారోపణా భావాలకు లేఖనాధారమేమీ లేదు. యెహోవా మనల్ని “కీడువిషయమై” శోధించడు. (యాకోబు 1:13) ఆయన మనల్ని పాములాంటి లేదా తేలులాంటి పరీక్షకు అప్పగించడు. మన పరలోకపు తండ్రి ‘తన్ను అడుగువారికి మంచి యీవులను’ అనుగ్రహిస్తాడు. (మత్తయి 7:10, 11; లూకా 11:12, 13) యెహోవా మంచితనాన్ని, మనకు సహాయం చేయాలనే ఆయన సుముఖతను మనమెంతగా అర్థం చేసుకుంటామో, అంత ఎక్కువ నమ్మకంతో ఆయనకు ప్రార్థించేందుకు మనం పురికొల్పబడతాం. మనమలా ప్రార్థించినప్పుడు మనం కూడా కీర్తనకర్త వ్యక్తపర్చిన ఈ మనోభావాలనే వ్యక్తపర్చగలుగుతాం: “నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు; ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు.”​—కీర్తన 10:17; 66:19.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి