-
దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?కావలికోట—2011 | జూలై 15
-
-
3. ఏడవ దినం మొదటి శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉందని యోహాను 5:16, 17లోని యేసు మాటలు ఎలా చూపిస్తున్నాయి?
3 ఏడవ దినం సా.శ. మొదటి శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి రెండు రుజువులు ఉన్నాయి. మొదటి రుజువును పరిశీలించండి. యేసు సబ్బాతు రోజున స్వస్థత చేసినందుకు ఆయన పనిచేశాడంటూ వ్యతిరేకులు ఆయనను నిందించారు. దానికి యేసు ఏమన్నాడో గమనించండి: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను.” (యోహా. 5:16, 17) ఆయన మాటలకు అర్థమేమిటి? యేసు సబ్బాతు రోజున పనిచేశాడని వ్యతిరేకులు ఆయనను నిందించారు. ‘నా తండ్రి పనిచేయుచున్నాడు’ అని చెప్పడం ద్వారా యేసు వారి నిందకు జవాబిచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే యేసు వారితో ఇలా అన్నాడు: ‘నేను, నా తండ్రి ఒకేలాంటి పని చేస్తున్నాం. వేల సంవత్సరాలుగా సాగుతున్న సబ్బాతు దినంలో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా సబ్బాతు రోజున పనిచేయడం తప్పేమీకాదు.’ దేవుని గొప్ప విశ్రాంతి దినం లేక ఏడవ దినం తన కాలంలో కూడా కొనసాగుతూనే ఉందని యేసు మాటలను బట్టి తెలుస్తోంది.a
-
-
దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?కావలికోట—2011 | జూలై 15
-
-
5. ఏడవ దినం విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఎప్పుడు పూర్తిగా నెరవేరుతుంది?
5 ఏడవ దినం ఎప్పటివరకు కొనసాగుతుందో తెలుసుకోవాలంటే, దాని విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటో మనం గుర్తుంచుకోవాలి. ఆ ఉద్దేశం గురించి ఆదికాండము 2:3 ఇలా చెబుతోంది: “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.” తన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా దేవుడు దాన్ని ‘పరిశుద్ధపరిచాడు’ లేదా ప్రత్యేకించాడు. తనకు లోబడే మానవులతో భూమి నిండాలని, వారు భూమినీ దానిపైనున్న ఇతర ప్రాణులనూ చూసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. (ఆది. 1:28) దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి యెహోవా దేవుడు మరియు “విశ్రాంతి దినమునకు ప్రభువైయున్న” యేసుక్రీస్తు ‘ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నారు.’ (మత్త. 12:8) ఏడవ దినం విషయంలో దేవుని ఉద్దేశం క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో పూర్తిగా నెరవేరుతుంది. అంతవరకు దేవుని విశ్రాంతి దినం కొనసాగుతుంది.
-
-
దేవుని విశ్రాంతి అంటే ఏమిటి?కావలికోట—2011 | జూలై 15
-
-
a యాజకులు, లేవీయులు సబ్బాతు రోజున ఆలయ సంబంధమైన పనులు చేసినా వారు ‘నిర్దోషులుగానే’ పరిగణించబడేవారు. కాబట్టి దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి ప్రధాన యాజకునిగా ఉన్న యేసు కూడా యెహోవా తనకిచ్చిన పనిని సబ్బాతు రోజున చేయడం తప్పేమీ కాదు.—మత్త. 12:5, 6.
-