-
యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడుకావలికోట—2006 | జనవరి 15
-
-
కయప తన తోటి పరిపాలకులతో ఇలా చెప్పినప్పుడు అతని దుష్టత్వం బయటపడింది: “మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు.” ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు [యేసును] చంప నాలోచించుచుండిరి.”—యోహాను 11:49-53.
కయపకు తన మాటల పూర్తి ప్రాధాన్యత తెలియదు. ఆయన ప్రధానయాజకునిగా సేవచేశాడు కాబట్టే అలా ప్రవచించాడు.b యేసు మరణం యూదులకు మాత్రమే ప్రయోజనకరం కాదు. ఆయన విమోచన క్రయధన బలి, మానవులందరికీ పాపమరణాల నుండి విముక్తి పొందే మార్గాన్ని ఏర్పరుస్తుంది.
-
-
యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడుకావలికోట—2006 | జనవరి 15
-
-
b యెహోవా ఇశ్రాయేలీయుల గురించిన సత్య ప్రవచనాలు ప్రవచించడానికి గతంలో దుష్ట బిలామును ఉపయోగించాడు.—సంఖ్యాకాండము 23:1-24:24.
-