మనం మరి గొప్ప క్రియలు చేయగలము
1 యేసుక్రీస్తు తన పరిచర్యలో అత్యద్భుతమైన క్రియలు చేశాడు. ఆయన అద్భుతరీతిన వేలాదిమందికి ఆహారం పెట్టాడు, అనేకమందిని స్వస్థపర్చాడు, కొంతమందిని మృతులలో నుండి పునరుత్థానం చేశాడు. (మత్త. 8:1-17; 14:14-21; యోహా. 11:38-44) ఆయన కార్యకలాపాలు పూర్తి జనాంగం అవధానాన్ని ఆకట్టుకున్నాయి. అయినా, తాను చనిపోవడానికి ముందురోజు సాయంత్రం విశ్వసనీయులుగా ఉన్న తన శిష్యులతో, “నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని” చెప్పాడు. (యోహా. 14:12) అయితే, మనం “మరి గొప్ప” క్రియలు ఎలా చేయగలము?
2 ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడంద్వారా: యేసు కార్యకలాపాలు పాలస్తీనాకే పరిమితంగా ఉన్నాయి. ఆయన తొలి శిష్యులు మాత్రం “భూదిగంతముల వరకు” సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞాపించబడ్డారు. అందుకు, యేసు ప్రకటించిన ప్రాంతపు పరిధులను వారు దాటి వెళ్లాలి. (అపొ. 1:8) ఆయన ప్రారంభించిన ప్రకటనా పని నేడు భూవ్యాప్తంగా 232 దేశాలకు విస్తరించింది. (మత్త. 24:14) మీ సంఘానికి నియమించబడిన టెరిటరీలో ప్రకటించే పనిలో మీరు పూర్తిగా భాగం వహిస్తున్నారా?
3 ఎక్కువమంది ప్రజల్ని చేరడంద్వారా: ప్రకటనా పనిని కొనసాగించడానికి యేసు చాలా కొద్దిమంది శిష్యుల్నే తయారు చేసివెళ్లాడు. అయితే, సా. శ. 33 పెంతెకొస్తు రోజున వారు ఇచ్చిన ఉత్సాహపూరిత సాక్ష్యం ఫలితంగా సత్యాన్ని హత్తుకుని, అదే రోజున బాప్తిస్మం తీసుకున్న వారి సంఖ్య దాదాపు మూడు వేలకు చేరుకుంది. (అపొ. 2:1-11, 37-41) “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారిని సమకూర్చడం మన కాలాల్లో కూడా కొనసాగుతుంది, ఇప్పుడు మనం రోజుకి సగటున 1,000 మందికిపైగా బాప్తిస్మం ఇస్తున్నాము. (అపొ. 13:48) నిజాయితీతో కూడిన హృదయంగల వారిని చేరుకోవడానికి మీరు చేయగల్గినదంతా చేస్తున్నారా, వారు ఎక్కడున్నా వారి ఆసక్తిని నిలపడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పునర్దర్శనాలు చేస్తున్నారా?
4 మరింత ఎక్కువ కాలంపాటు ప్రకటించడంద్వారా: యేసు భూపరిచర్య కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది. మనలో చాలామందిమి అంతకన్నా ఎక్కువకాలం నుండి ప్రకటిస్తూ ఉన్నాము. ఈ పని చేయడానికి మనం ఎంత ఎక్కువ కాలం అనుమతించబడినప్పటికీ, ప్రతి క్రొత్త శిష్యునికీ జీవానికి నడిపే మార్గానికి రావడానికి సహాయం చేయడానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. (మత్త. 7:14) మీరు ప్రతి నెలా ప్రభువు కార్యంలో ఆసక్తిగలవారై ఉంటున్నారా?—1 కొరిం. 15:58.
5 యేసు మద్దతుతో మనం ఆయన నిజమైన శిష్యులుగా మరింత గొప్ప క్రియలు చేస్తామని పూర్ణ నమ్మకంతో ఉండగలము.—మత్త. 28:19, 20.