కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
    • ఒకాయన వాళ్ల ఇంటి ముందు నిల్చున్నాడు. ఆయనతో ఒక జంట బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని ఉపయోగించి మాట్లాడుతున్నారు.

      అపొస్తలుల్లాగే మనం కూడా “ఇంటింటికి” వెళ్లి ప్రకటిస్తాం

      16. పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అపొస్తలులు ఎలా చూపించారు? వాళ్లలాగే ఇప్పుడు మనం కూడా ఎలా ప్రకటిస్తున్నాం?

      16 అపొస్తలులు ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా, ప్రకటనా పని మొదలుపెట్టారు. వాళ్లు ఏమాత్రం భయపడకుండా “ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా . . . యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.”d (అపొ. 5:42) ఉత్సాహం గల ఆ క్రైస్తవులు పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టే, వాళ్లు ప్రజల ఇళ్లకు వెళ్లి మంచివార్త ప్రకటించారు. (మత్త. 10:7, 11-14) అలా ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తూ, యెరూషలేము మొత్తాన్ని వాళ్ల బోధతో నింపేశారు. అపొస్తలుల్లాగే ఇప్పుడు యెహోవాసాక్షులు కూడా ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తారని చాలామందికి తెలుసు. మనం కూడా మనకు ఇచ్చిన ప్రాంతంలో ప్రతీ ఇంటికి వెళ్లడం ద్వారా పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలి, మంచివార్త వినే అవకాశం ప్రతీఒక్కరికి ఇవ్వాలి అని కోరుకుంటున్నామని చూపిస్తాం. మన ఇంటింటి పరిచర్యను యెహోవా దీవించాడా? దీవించాడు! అంతానికి దగ్గరౌతున్న ఈ సమయంలో, లక్షలమంది రాజ్యం గురించిన మంచివార్తను అంగీకరించారు. వాళ్లలో ఎక్కువ శాతం మంది మంచివార్తను మొదటిసారి విన్నది, యెహోవాసాక్షులు వాళ్ల తలుపు తట్టినప్పుడే.

      “ఇంటింటా” ప్రకటించడం

      మహాసభ ప్రకటనా పనిని నిషేధించినా, శిష్యులు “ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా మానకుండా బోధిస్తూ,” ప్రకటిస్తూ ఉన్నారు. (అపొ. 5:42) అసలు “ఇంటింటా” అనే మాటకు అర్థం ఏంటి?

      ఇక్కడ ఉపయోగించిన కాట్‌ అయ్‌కోన్‌ అనే గ్రీకు పదానికి, “ఒక ఇంటికి వెళ్లడం” అనే అర్థం ఉంది. కొంతమంది అనువాదకులు ఏమంటారంటే, ఇక్కడ ఉపయోగించిన కాటా అనే గ్రీకు పదాన్ని బట్టి, శిష్యులు ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటికి వెళ్లి ప్రకటించారని అర్థమౌతుంది. ఆ పదాన్ని లూకా 8:1 లో కూడా చూస్తాం. అక్కడ యేసు “ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి” వెళ్లి ప్రకటించాడని ఉంది.

      అపొస్తలుల కార్యాలు 20:20 లో, బహువచనమైన కాట్‌ అయ్‌కోస్‌ అనే గ్రీకు పదాన్ని చూస్తాం. అక్కడ, అపొస్తలుడైన పౌలు తన దగ్గరికి వచ్చిన పెద్దలతో ఇలా అన్నాడు: “దేన్నీ నేను మీకు చెప్పకుండా ఉండలేదు, మీకు బహిరంగంగా ఇంటింటా బోధించకుండా ఉండలేదు.” పౌలు పెద్దల ఇళ్లకు వెళ్లి బోధించాడని కొంతమంది అంటారు. కానీ అది తప్పు అని తర్వాతి వచనం చూస్తే తెలుస్తుంది: “పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగమని, మన ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచమని యూదులకు, గ్రీసు దేశస్థులకు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చాను.” (అపొ. 20:21) ఆ పెద్దలు అప్పటికే పశ్చాత్తాపపడి యేసు మీద విశ్వాసం ఉంచారు. కాబట్టి పౌలు ఇంటింటా ప్రకటించింది, బోధించింది అవిశ్వాసులకే అని అర్థమౌతుంది.

  • “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి