-
‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు’“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
-
-
17, 18. దేవునికి దగ్గరవ్వాలని మనుషులు ఎందుకు కోరుకోవాలి? ప్రజలకు తగ్గట్టు పౌలు బోధించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
17 దేవునికి దగ్గరవ్వాలని మనుషులు కోరుకోవాలి. దానికి గల ఒక కారణాన్ని పౌలు ఇలా చెప్పాడు: “ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.” పౌలు ఇక్కడ క్రేతుకు చెందిన ఎపిమెనిడిస్ అనే కవి రాసిన మాటల్ని ఉపయోగించాడని కొంతమంది పండితులు అంటారు. ఆయన క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందినవాడు. ఏథెన్సు సంస్కృతిలో ఆయనకు మంచిపేరు ఉంది. దేవునికి దగ్గరవ్వాలని మనుషులు ఎందుకు కోరుకువాలో వివరిస్తూ పౌలు ఇంకో కారణాన్ని చెప్పాడు. పౌలు ఇలా అన్నాడు: “మీ కవులలో కొంతమంది చెప్పినట్టు, ‘మనం కూడా ఆయన పిల్లలమే.’” (అపొ. 17:28) దేవుడే మొదటి మనిషిని సృష్టించాడు, ఆ మనిషి నుండే మనందరం వచ్చాం. కాబట్టి మనుషులందరూ ఆ దేవునికి దగ్గరవ్వాలి. పౌలు తెలివిగా, గ్రీకు కవుల మాటల్ని ఉపయోగిస్తూ ప్రజలకు నచ్చేలా మాట్లాడాడు.e పౌలు ఆదర్శాన్ని పాటిస్తూ మనం కూడా అప్పుడప్పుడు చరిత్ర పుస్తకాల్ని, ఎన్‌సైక్లోపీడియాల్ని, మంచి పేరున్న ఇతర రెఫరెన్సుల్ని కొంతవరకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కొన్ని అబద్ధమత ఆచారాలు ఎలా వచ్చాయో సాక్షులు కానివాళ్లకు వివరించడానికి మనం వాటిని ఉపయోగించవచ్చు.
-
-
‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు’“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
-
-
e పౌలు ఇక్కడ స్తోయికుల కవి అయిన అరాటస్ రచించిన ఫినామినా అనే కవితలోని మాటల్ని చెప్పాడు. ఇలాంటి మాటలే ఇతర గ్రీకు రచనల్లో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు స్తోయికుల రచయిత అయిన క్లియాంతీస్ రచించిన హిమ్న్ టు జూస్‌లో అలాంటి మాటలు కనిపిస్తాయి.
-