కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు
    కావలికోట—2011 | జూన్‌ 15
    • 7, 8. ఇద్దరు పరిపూర్ణ మానవులు ప్రవర్తించిన తీరు వల్ల ఎలాంటి భిన్నమైన ఫలితాలు వచ్చాయి?

      7 వారసత్వంగా వచ్చిన పాపం నుండి మానవులు విముక్తి పొందేలా యెహోవా ప్రేమతో ఒక ఏర్పాటు చేశాడు. తర్వాత వచ్చిన మరో పరిపూర్ణ మానవుని ద్వారా అంటే రెండవ ఆదాము ద్వారా వారు విముక్తి పొందడం సాధ్యమౌతుందని పౌలు వివరించాడు. (1 కొరిం. 15:45) ఆ ఇద్దరు పరిపూర్ణ మానవులు ప్రవర్తించిన తీరు వల్ల ఎంతో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఎలా?—రోమీయులు 5:15, 16 చదవండి.

      8 “అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు” అని పౌలు రాశాడు. ఆదాము అపరాధి కాబట్టి న్యాయంగానే ఆయన తీవ్రమైన శిక్షను అంటే మరణాన్ని పొందాడు. అయితే, చనిపోయింది ఆయనొక్కడే కాదు. మనమిలా చదువుతాం: “[ఆ] ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిరి.” ఆదాముకు విధించబడిన న్యాయమైన శిక్ష అపరిపూర్ణులైన ఆయన పిల్లలందరికీ, అంటే మనకు కూడా వర్తిస్తుంది. అయితే, పరిపూర్ణ మానవుడైన యేసు దానికి పూర్తిగా భిన్నమైన ఫలితాన్ని తీసుకురాగలిగాడని తెలుసుకొని మనం ఊరట పొందవచ్చు. ఆ ఫలితం ఏమిటి? దానికి సమాధానం పౌలు రాసిన ఈ మాటల్లో ఉంది: “మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడు[తుంది].”—రోమా. 5:18.

      9. రోమీయులు 5:16, 18లో చెప్పబడినట్లు దేవుడు మానవులను నీతిమంతులుగా తీర్పుతీర్చడానికి ఏమి చేస్తున్నాడు?

      9 ‘నీతి విధింపబడడం,’ ‘నీతిమంతులుగా తీర్చబడడం’ అని అనువదించబడిన గ్రీకు పదాలకు అర్థమేమిటి? దాని గురించి ఒక బైబిలు అనువాదకుడు ఇలా రాశాడు: “అది న్యాయపరమైన ఒక రూపకాలంకారం. న్యాయపరమైన అంశంలా కనిపించే ఓ విషయాన్ని అది వివరిస్తోంది. ఒకరి వ్యక్తిత్వంలో వచ్చే మార్పు గురించి కాదుగానీ దేవుని ముందు ఆ వ్యక్తికున్న స్థానంలో వచ్చే మార్పు గురించి అది చెబుతోంది. . . . ఆ రూపకాలంకారం, ఓ నిందితునికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న న్యాయాధిపతిగా దేవుణ్ణి చిత్రీకరిస్తోంది. ఆ వ్యక్తి అనీతిమంతుడనే ఆరోపణ మీద దేవుని న్యాయస్థానం ముందుకు తీసుకురాబడ్డాడు. అయితే దేవుడు ఆయనను నిర్దోషిగా తీర్పుతీర్చాడు.”

  • దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు
    కావలికోట—2011 | జూన్‌ 15
    • 14, 15. దేవునిచే నీతిమంతులుగా తీర్చబడినవారు ఏ ఆశీర్వాదాన్ని పొందుతారు? అయినా వారు ఏమి చేస్తూ ఉండాలి?

      14 ఒక వ్యక్తికి వారసత్వంగా వచ్చిన పాపాన్ని, అతను చేసిన తప్పులను సర్వశక్తిమంతుడు క్షమించడం ఎంత గొప్ప బహుమానమో ఒక్కసారి ఆలోచించండి! క్రైస్తవులుగా మారకముందు ఆయా వ్యక్తులు లెక్కలేనన్ని పాపాలు చేసివుంటారు. అయినా విమోచన క్రయధనం ఆధారంగా దేవుడు ఆ పాపాలను క్షమించగలడు. దీని గురించి పౌలు ఇలా రాశాడు: “కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.” (రోమా. 5:16) అయితే ఈ ప్రేమపూర్వక బహుమానాన్ని పొందే (నీతిమంతులుగా తీర్చబడిన) అపొస్తలులు, ఇతరులు విశ్వాసంతో సత్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దానివల్ల భవిష్యత్తులో వారు ఏ ఆశీర్వాదాన్ని పొందుతారు? “కృపాబాహుళ్యమును, నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.” నీతి అనే బహుమానం పాపపు ప్రభావాలను తీసివేయడానికి దోహదపడుతుంది. దానివల్ల చివరకు జీవం లభిస్తుంది.—రోమా. 5:17; లూకా 22:28-30 చదవండి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి