-
ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండికావలికోట—2011 | నవంబరు 15
-
-
8 చాలా ఆజ్ఞలున్న ధర్మశాస్త్రం పాపులను శిక్షించింది. అంతేకాక, ఇశ్రాయేలులో ధర్మశాస్త్రం కింద సేవచేస్తున్న ప్రధాన యాజకులు కూడా అపరిపూర్ణులు కాబట్టి వాళ్లు పాపానికి తగిన బలిని అర్పించలేకపోయారు. అందుకే దేవుడు, తన సొంత కుమారుణ్ణి ‘పాపశరీరాకారములో’ పంపడం ద్వారా పాపానికి శిక్ష విధించాడు. అలా యేసు విమోచన క్రయధన బలి ‘ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో దాన్ని’ చేసింది. ఫలితంగా అభిషిక్త క్రైస్తవులు యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసం ఉంచినందుకు నీతిమంతులుగా గుర్తించబడుతున్నారు. ‘శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకోవాలి’ అని వాళ్ళకు చెప్పబడింది. (రోమీయులు 8:2బి-4 చదవండి.) వాళ్ళు ‘జీవకిరీటం’ పొందాలంటే భూజీవితం ముగిసేవరకు నమ్మకంగా అలా చేయాలి.—ప్రక. 2:10.
-
-
ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండికావలికోట—2011 | నవంబరు 15
-
-
10. పాపమరణాల నియమం మనమీద ఎలా ప్రభావం చూపిస్తుంది?
10 “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 5:12) మనందరం ఆదాము నుండి వచ్చాం కాబట్టి మనమీద కూడా పాపమరణాల నియమం ప్రభావం చూపిస్తోంది. మనం అపరిపూర్ణులం కాబట్టి దేవునికి ఇష్టంలేని పనులు చేస్తాం, చివరకు మరణిస్తాం. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అలాంటి పనులను, గుణాలను “శరీరకార్యములు” అంటూ, “వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు” అని చెప్పాడు. (గల. 5:19-21) ఇలాంటి ప్రజలు శరీరానుసారంగా నడుచుకుంటారు. (రోమా. 8:3-5) వాళ్ళ అపరిపూర్ణ శరీరం ఏమి చెబితే అదే చేస్తారు. జారత్వానికి పాల్పడితే, విగ్రహారాధన చేస్తే, భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొంటే, ఇంకా ఇతర ఘోరమైన పాపాలు చేస్తే మాత్రమే శరీరానుసారంగా నడుచుకున్నట్లా? అలాగని కాదు, ఎందుకంటే పౌలు రాసినట్లు మత్సరము, క్రోధము, కక్ష, అసూయ కూడా శరీరకార్యాలే. అవి కొంతమంది అనుకుంటున్నట్లు వ్యక్తుల్లోని లోపాలు మాత్రమే కాదు. కాబట్టి శరీరానుసారంగా నడుచుకోవడం పూర్తిగా మానేశామని మనలో ఎవరమూ చెప్పలేం.
-
-
ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండికావలికోట—2011 | నవంబరు 15
-
-
12 మన పరిస్థితి, భయంకరమైన ఒక వ్యాధి నయమౌతున్నప్పుడు ఉండే పరిస్థితిలా ఉంది. మనం పూర్తిగా బాగుపడాలంటే డాక్టరు ఏమి చేయమంటే అది చేయాలి. విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచడం వల్ల పాపమరణాల నియమం నుండి బయటపడే అవకాశం ఉన్నా మనం అపరిపూర్ణులమే, పాపులమే. కాబట్టి దేవునితో మంచి సంబంధం ఏర్పర్చుకొని ఆయన ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం చేయాల్సింది ఇంకా ఉంది. పౌలు “ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి” నెరవేర్చబడడం గురించి చెబుతున్నప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకోవడం గురించి కూడా చెప్పాడు.
ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఏమి చేయాలి?
13. ఆత్మానుసారంగా నడవాలంటే ఏమి చేయాలి?
13 సాధారణంగా మనం నడుస్తున్నప్పుడు, చేరుకోవాలనుకుంటున్న గమ్యం వైపుగా ముందుకు వెళ్తాం. అలాగే ఆత్మానుసారంగా నడవాలంటే మనం క్రమేణా ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి. అంతేగానీ ఆధ్యాత్మిక పరిపూర్ణత సంపాదించనవసరం లేదు. (1 తిమో. 4:15) ప్రతీరోజు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి లేదా జీవించడానికి మనం సాధ్యమైనంతవరకు కృషిచేయాలి. ‘ఆత్మానుసారంగా నడుచుకుంటే’ దేవుని ఆమోదం ఉంటుంది.—గల. 5:16.
-