కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 7. దేవుని రాజ్యం పెట్టే నియమాలు చాలా గొప్పవి

      ప్రభుత్వాలు ఎలాగైతే తమ పౌరుల మంచి కోసం నియమాలు పెడతాయో, అలాగే దేవుని రాజ్యం కూడా ప్రజల మంచి కోసం నియమాలు పెడుతుంది. 1 కొరింథీయులు 6:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • ప్రతీ ఒక్కరు దేవుని నియమాలు పాటిస్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?a

      • తన రాజ్యం కింద ఉండే ప్రజలు ఈ నియమాల్ని పాటించాలని యెహోవా చెప్పడం సరైనదే అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

      • ఇప్పటివరకు ఈ నియమాలు పాటించనివాళ్లు కూడా మారగలరు అని ఎలా చెప్పవచ్చు?—11వ వచనం చూడండి.

      రద్దీగా ఉన్న ఒక కూడలి దగ్గర పోలీసు ట్రాఫిక్‌ని ఆపుతున్నాడు. వేర్వేరు వయసుల వాళ్లు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నారు.

      ప్రభుత్వాలు తమ పౌరుల మంచి కోసం నియమాలు పెడతాయి. దేవుని రాజ్యం ప్రజల మంచి కోసం అంతకంటే గొప్ప నియమాలు పెడుతుంది

  • సెక్స్‌ గురించి బైబిలు ఏం చెప్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • మనకు ఏది మంచిదో యెహోవాకు బాగా తెలుసు. మనం ఎలా పవిత్రంగా ఉండవచ్చో, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఆయన చెప్తున్నాడు. సామెతలు 7:7-27 చదవండి లేదా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

      వీడియో: వివేచన లేకపోవడం (9:31)

      • ఒక యువకుడు తప్పు చేయాలనిపించే పరిస్థితుల వైపు ఎలా అడుగులు వేశాడు?—సామెతలు 7:8, 9 చూడండి.

      • సామెతలు 7:23, 26 చెప్తున్నట్టు, లైంగిక పాపం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. పవిత్రంగా ఉండడం వల్ల మనం ఎలాంటి సమస్యలు తప్పించుకోవచ్చు?

      • మనం ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలంటే, మన ప్రవర్తన పవిత్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

      మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య సెక్స్‌ తప్పని బైబిలు చెప్పడం మరీ కఠినంగా ఉందని కొంతమంది అంటారు. కానీ ప్రేమగల దేవుడైన యెహోవా, ప్రతీఒక్కరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆ జీవితం పొందాలంటే, మనం యెహోవా చెప్పేవి పాటించాలి. 1 కొరింథీయులు 6:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • దేవుని దృష్టిలో, స్వలింగ సంపర్కం మాత్రమే తప్పా?

      దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, మనందరం మార్పులు చేసుకోవడానికి కృషి చేయాలి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కీర్తన 19:8, 11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • యెహోవా చెప్పేవన్నీ మన మంచికే అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

      చిత్రాలు: 1. ఒక యువతి తన బాయ్‌ ఫ్రెండ్‌ పక్కన కూర్చుంది కానీ సంతోషంగా లేదు. ఆమె నైట్‌ క్లబ్‌లో తన స్నేహితులతో కలిసి మందు కొడుతుంది, సిగరెట్‌ తాగుతుంది. 2. అదే యువతి రాజ్యమందిరంలో సహోదరీలతో సంతోషంగా మాట్లాడుతుంది.

      తన నియమాల్ని, సూత్రాల్ని పాటించేలా యెహోవా ఎంతోమందికి సహాయం చేశాడు. ఆయన మీకు కూడా సహాయం చేయగలడు

  • మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 6. తాగుడు అలవాటు నుండి ఎలా బయటపడవచ్చు?

      తాగుడు అలవాటును మానుకోవడానికి ఒకాయనకు ఏది సహాయం చేసిందో పరిశీలించండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

      వీడియో: ‘నా జీవన విధానంతో నాకు విసుగొచ్చేసింది’ (6:32)

      చిత్రాలు: ‘నా జీవన విధానంతో నాకు విసుగొచ్చేసింది’ వీడియోలోని సన్నివేశాలు. 1. దిమిత్రి మందు బాటిల్‌ వంక చూస్తున్నాడు. 2. దిమిత్రి, ఆయన భార్య, కూతురు కలిసి బైబిల్ని అధ్యయనం చేస్తున్నారు.
      • దిమిత్రి తాగినప్పుడు ఎలా ప్రవర్తించేవాడు?

      • ఆయన ఒక్కసారిగా తాగుడు అలవాటును మానుకోగలిగాడా?

      • చివరికి ఆయన ఆ అలవాటు నుండి ఎలా బయటపడ్డాడు?

      1 కొరింథీయులు 6:10, 11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • తాగుబోతుతనాన్ని యెహోవా ఎలా చూస్తాడు?

      • తాగుడుకు బానిసైన వాళ్లు దాన్నుండి బయటపడగలరని ఎలా చెప్పవచ్చు?

      మత్తయి 5:30 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • ఇక్కడ చేయి నరికేసుకోవడం అంటున్నప్పుడు, యెహోవాను సంతోషపెట్టడానికి మనం కొన్నిటిని వదులుకోవాలి అని అర్థం. ఒకవేళ మీరు తాగుడు అలవాటును మానుకోలేకపోతుంటే, ఎంతగా కృషి చేయాలని ఈ వచనం చెప్తోంది?a

      1 కొరింథీయులు 15:33 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • అతిగా తాగేవాళ్లతో సహవసిస్తే ఏం జరిగే ప్రమాదం ఉంది?

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి