-
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
-
-
3. బిలాము వ్యూహం వల్ల ఎంత నష్టం జరిగింది?
3 ఈ వ్యూహం ఫలించిందా? ఒకరకంగా అవుననే చెప్పవచ్చు. వేలమంది ఇశ్రాయేలీయులు అతని గాలానికి చిక్కి ‘మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు.’ సంతాన సాఫల్య దేవుడైన బయల్పెయోరునే కాదు మోయాబీయుల ఇతర దేవతలను కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. ఫలితంగా వాగ్దానదేశంలోకి ఇక ప్రవేశిస్తారనగా 24,000 మంది ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు. అదెంత విషాదకరం!—సంఖ్యాకాండము 25:1-9.
-
-
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
-
-
4. వేలాదిమంది ఇశ్రాయేలీయులు వ్యభిచారం అనే ఎరకు ఎందుకు చిక్కారు?
4 అంతటి ఘోరం ఎందుకు జరిగింది? ఎందుకంటే, తమను ఐగుప్తు నుండి విడిపించి, అరణ్యంలో పోషించి, వాగ్దానదేశం వరకు సురక్షితంగా తీసుకొచ్చిన యెహోవాకు దూరమై చాలామంది చెడుగా ఆలోచించడం మొదలుపెట్టారు. (హెబ్రీయులు 3:12) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.”a—1 కొరింథీయులు 10:8.
-
-
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
-
-
a సంఖ్యాకాండములో, న్యాయాధిపతులు హతమార్చిన దాదాపు 1,000 మంది ‘అధిపతులతో’ సహా యెహోవా శిక్షించినవారి గురించి కూడా ప్రస్తావించబడిందని తెలుస్తోంది.—సంఖ్యాకాండము 25:4, 5.
-