-
దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండినిత్యజీవానికి నడిపించే జ్ఞానము
-
-
“ప్రేమను ధరించుకొనుడి”
9. ప్రేమను ప్రదర్శించడంలో యెహోవా ఎలా మాదిరినుంచాడు?
9 పౌలు ఇలా వ్రాశాడు: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:14) యెహోవా దయాపూర్వకంగా మనకు ఈ వస్త్రధారణను అందజేస్తున్నాడు. ఏ విధంగా? క్రైస్తవులు ప్రేమను ప్రదర్శించవచ్చు, ఎందుకంటే అది యెహోవా యొక్క పరిశుద్ధాత్మ ఫలాల్లో దేవుడిచ్చిన ఒక ఫలం. (గలతీయులు 5:22, 23) మనం నిత్య జీవం పొందగలిగేలా తన అద్వితీయ కుమారున్ని పంపించడం ద్వారా యెహోవా తానే అత్యంత గొప్ప ప్రేమను ప్రదర్శించాడు. (యోహాను 3:16) ప్రేమ యొక్క ఈ అత్యున్నతమైన ప్రదర్శన, ఈ లక్షణాన్ని చూపించడంలో మనకు ఒక మాదిరిని అందించింది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.”—1 యోహాను 4:11.
10. “సహోదరుల పూర్తి సహవాసం” నుండి మనం ఎలా ప్రయోజనం పొందగలము?
10 మీరు రాజ్యమందిరంలోని కూటాలకు హజరు కావడం ప్రేమ చూపించడానికి మీకు చక్కని అవకాశాన్ని ఇస్తుంది. అక్కడ మీరు వివిధ రకాలైన ప్రజలను కలుస్తారు. నిస్సందేహంగా మీరు వెంటనే అనేకుల వైపు ఆకర్షించబడినట్లుగా భావిస్తారు. నిజమే, యెహోవాను సేవించేవారిలో కూడా వ్యక్తివ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి. బహుశా గతంలో, కేవలం మీ ఆసక్తులను లేక లక్షణాలను పంచుకోని వారిని మీరు నివారించి ఉండవచ్చు. అయితే, క్రైస్తవులు “సహోదరుల పూర్తి సహవాసాన్ని ప్రేమించాలి.” (1 పేతురు 2:17, NW) వయస్సు, వ్యక్తిత్వం, జాతి, లేక విద్యాస్థాయి వంటివాటిలో మీనుండి భిన్నంగా ఉండే వ్యక్తులతో సహా, రాజ్య మందిరం వద్దనున్న వారందరితో పరిచయం ఏర్పరచుకోవడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రీతిపాత్రమైన గుణాన్ని కలిగివున్నట్లు మీరు కనుగొంటారు.
11. యెహోవా ప్రజల మధ్యనున్న విభిన్న వ్యక్తిత్వాలను బట్టి మీరెందుకు కలత చెందకూడదు?
11 సంఘంలో ఉన్న భిన్నవ్యక్తిత్వాలు మీ శాంతిని భంగపర్చనవసరం లేదు. ఉదాహరణకు, మీతోపాటు రోడ్డు మీద వాహనాలనేకం ప్రయాణిస్తున్నట్లుగా ఊహించండి. అందరూ ఒకే వేగంతో వెళ్లరు, లేక అందరూ ఒకే స్థితిలో ఉండరు. కొందరు ఎన్నో మైళ్లు ప్రయాణించారు, కాని కొందరు మీలా ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టారు. అయితే, ఈ భేదాలు ఉన్నప్పటికీ, అందరూ అదే రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఒక సంఘంలో ఉన్న వ్యక్తుల విషయం కూడా అలాగే ఉంటుంది. అందరూ ఒకే వేగంతో క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోలేరు. అంతేగాక, అందరూ ఒకే శారీరక లేక మానసిక స్థితిలో ఉండరు. కొందరు యెహోవాను అనేక సంవత్సరాలుగా ఆరాధిస్తున్నారు; ఇతరులు ఇప్పుడే ప్రారంభించారు. అయినప్పటికీ, అందరూ “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను” నిత్యజీవానికి నడిపే మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. (1 కొరింథీయులు 1:10) గనుక, సంఘంలోనున్న వారి బలహీనతల కంటే, ఉన్నతమైన లక్షణాలను చూడండి. అలా చేయడం, దేవుడు నిజంగా ఈ ప్రజల మధ్య ఉన్నాడని మీరు గ్రహించేలా చేస్తుంది గనుక మీ హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. మీరు ఉండాలని కోరుకునేది నిశ్చయంగా ఇక్కడే.—1 కొరింథీయులు 14:25.
12, 13. (ఎ) సంఘంలో ఎవరైనా మీకు అభ్యంతరం కలుగజేస్తే, మీరేమి చేయవచ్చు? (బి) విరోధాన్ని మనస్సునందుంచుకోక పోవడం ఎందుకు ప్రాముఖ్యము?
12 మానవులందరూ అపరిపూర్ణులే గనుక, కొన్నిసార్లు సంఘంలోని ఎవరైనా మిమ్మల్ని కలతపర్చే మాట అనడం గాని లేక ఏదైనా చేయడం గాని జరుగవచ్చు. (రోమీయులు 3:23) శిష్యుడైన యాకోబు వాస్తవికంగానే ఇలా వ్రాశాడు: “అనేకవిషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపములేనివాడై” యుండును. (యాకోబు 3:2) ఎవరైనా మీకు కోపం రప్పిస్తే మీరెలా ప్రతిస్పందిస్తారు? ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” (సామెతలు 19:11) సుబుద్ధి కలిగివుండడమంటే ఒక పరిస్థితి యొక్క లోతును చూడడం, ఒక వ్యక్తి ఫలానా విధంగా మాట్లాడేలా లేక ప్రవర్తించేలా చేసే ముఖ్య కారణాలను అర్థం చేసుకోవడం. మనలో అనేకులం మన స్వంత తప్పులను క్షమించుకోవడంలో ఎంతో సుబుద్ధిని ఉపయోగిస్తాము. ఇతరుల అపరిపూర్ణతలను అర్థం చేసుకోవడానికి, వాటిని కప్పడానికి దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు?—మత్తయి 7:1-5; కొలొస్సయులు 3:13.
13 మనం యెహోవా క్షమాపణను పొందాలంటే మనం ఇతరులను క్షమించాలని ఎన్నడూ మరచిపోకండి. (మత్తయి 6:9, 12, 14, 15) మనమా సత్యాన్ని ఆచరిస్తున్నట్లయితే, మనం ఇతరులతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాము. (1 యోహాను 1:6, 7; 3:14-16; 4:20, 21) కాబట్టి, మీరు సంఘంలోని ఒక వ్యక్తితో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, విరోధము పెరగకుండా ఉండేందుకు పోరాడండి. మీరు ప్రేమను ధరించుకొంటే, సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు, ఒకవేళ మీరు తప్పుచేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి మీరు వెనుకాడరు.—మత్తయి 5:23, 24; 18:15-17.
14. మనం ఏ లక్షణాలను ధరించుకోవాలి?
14 మన ఆత్మీయ వస్త్రధారణలో, ప్రేమతో సన్నిహిత సంబంధం గల ఇతర లక్షణాలు కూడా చేరి ఉండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” ప్రేమచే కప్పబడిన ఈ లక్షణాలు, దైవికమైన “నవీన స్వభావము”లో ఒక భాగం. (కొలొస్సయులు 3:10, 12) మీరు ఈ విధమైన వస్త్రధారణకు కృషి చేస్తారా? ప్రాముఖ్యంగా మీరు సహోదర ప్రేమను ధరిస్తే, మీకు యేసు శిష్యులను సూచించే గుర్తింపు చిహ్నం ఉన్నట్లే, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’—యోహాను 13:35.
-
-
దేవుని ప్రజల మధ్య భద్రతను కనుగొనండినిత్యజీవానికి నడిపించే జ్ఞానము
-
-
[165వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]
-