కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూడటం
    కావలికోట—1999 | జూన్‌ 1
    • ‘వారిని మిక్కిలి ఘనముగా ఎంచవలెను’

      14, 15. (ఎ) 1 థెస్సలొనీకయులు 5:12, 13 ప్రకారం పెద్దలు ఎందుకు ఘనతకు పాత్రులు? (బి) పెద్దలు ‘మనలో ప్రయాసపడుతున్నారు’ అని ఎందుకు చెప్పగలము?

      14 ‘మనుష్యులలో ఈవులను’ ఘనముగా ఎంచడం ద్వారా కూడా మనం వారిపట్ల మెప్పుదలను ప్రదర్శించగలము. థెస్సలొనీకలోని సంఘానికి వ్రాస్తూ పౌలు అందులోని సభ్యులను ఇలా ప్రోత్సహించాడు: “మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలె[ను].” (1 థెస్సలొనీకయులు 5:12, 13) “ప్రయాసపడుచు”—అనే ఈ మాట మన కోసం నిస్వార్థంగా పాటుపడే అంకిత భావంగల పెద్దలకు సరిగ్గా సరిపోదూ? మన ప్రియమైన ఈ సహోదరులు ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఒక్క క్షణం ఆలోచించండి.

  • ‘మనుష్యులలో ఈవులను’ మెప్పుదలతో చూడటం
    కావలికోట—1999 | జూన్‌ 1
    • 16. పెద్దలకు మనం ఘనతను ఇవ్వగల విధానాలను వివరించండి.

      16 మనం వారిని ఘనముగా ఎలా ఎంచగలం? ఒక బైబిలు సామెత ఇలా అంటుంది: “సమయోచితమైన మాట యెంత మనోహరము!” (సామెతలు 15:23; 25:11) కాబట్టి నిజాయితీతో వారిని మెచ్చుకుంటూ, వారిని ప్రోత్సహిస్తూ చేసే వ్యాఖ్యానాలు మనం వారి ప్రయాసను వృధా ప్రయాసగా ఎంచడం లేదని చూపగలవు. అంతేగాక, మనం వారినుండి అపేక్షించే వాటి విషయంలో కూడా మనం సహేతుకంగా ఉండాలి. ఒకవైపు, మనం వారి సహాయం కోసం స్వేచ్ఛగా వారి దగ్గరకు వెళ్లగల్గాలి. కొన్నిసార్లు ‘మన గుండెలు వేదనపడే’ సందర్భాలు ఉంటాయి, అప్పుడు మనకు దేవుని వాక్యాన్ని ‘బోధింపతగినవారి’ నుండి లేఖనాధారమైన ప్రోత్సాహం, నడిపింపు, లేదా సలహా అవసరం అవుతుంది. (కీర్తన 55:4; 1 తిమోతి 3:2, 3) అదే సమయంలో, ఒక పెద్ద దగ్గర మన కోసం వెచ్చించగల్గే సమయం కొంతమాత్రమే ఉంటుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన తన సొంత కుటుంబ అవసరాలనూ సంఘంలోని ఇతరుల అవసరాలనూ ఉపేక్షించలేడు. కష్టపడి పనిచేసే ఈ సహోదరుల పట్ల తదనుభూతితో మనం వారినుండి సహేతుకంకాని డిమాండ్లను చేయలేము. (1 పేతురు 3:8) బదులుగా, వారు మన కోసం సహేతుకంగా వెచ్చించగల సమయమూ అవధానమూ విషయమై మనం మెప్పుదలను కనపరుద్దాము.—ఫిలిప్పీయులు 4:5.

      17, 18. పెద్దలుగా ఉన్నవారి అనేకమంది భార్యలు ఎటువంటి త్యాగాలు చేస్తారు, విశ్వసనీయులైన ఈ సహోదరీలను మనం అల్పంగా ఎంచడం లేదని మనం ఎలా చూపించగలము?

      17 పెద్దల భార్యల సంగతేమిటి? వారు కూడా మన ఘనతకు పాత్రులు కారా? ఎంతైనా, వారు తమ భర్తలను సంఘంతో పంచుకుంటున్నారు మరి. ఇలా చేయడానికి వారి పక్షంగా త్యాగాలు అవసరమౌతాయి. అప్పుడప్పుడు, పెద్దలు సాయంత్రం పూటల్లో సంఘ విషయాలను చూసుకోవడానికి సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది, ఆ సమయాన్ని వారు తమ కుటుంబాలతో వెచ్చించివుండేవారే. చాలా సంఘాల్లో విశ్వసనీయులైన స్త్రీలు, తమ భర్తలు యెహోవా గొఱ్ఱెలపట్ల శ్రద్ధ వహించేలా ఇష్టపూర్వకంగా అటువంటి త్యాగాలు చేస్తున్నారు.—పోల్చండి 2 కొరింథీయులు 12:15.

      18 విశ్వసనీయులుగా ఉన్న ఈ క్రైస్తవ సహోదరీల విలువను తక్కువ చేయడంలేదని మనం ఎలా చూపించగలం? వారి భర్తలనుండి అసహేతుకంగా డిమాండు చేయకుండటం ద్వారా అలా నిశ్చయంగా చూపించవచ్చు. కానీ మెప్పుదలతో కూడిన చిన్న మాటల్లో ఉన్న బలాన్ని కూడా మర్చిపోకుందాము. సామెతలు 16:24 ఇలా చెబుతుంది: “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.” ఒక అనుభవాన్ని పరిశీలించండి. ఒక క్రైస్తవ కూటం తర్వాత, వివాహితులైన ఇద్దరు భార్యాభర్తలు ఒక పెద్ద దగ్గరికి వచ్చి, యౌవనస్థుడైన తమ కుమారుడ్ని గురించి ఆయనతో మాట్లాడాలని అడిగారు. ఆ పెద్ద ఈ దంపతులతో మాట్లాడినంతసేపు ఆయన భార్య ఓపిగ్గా వేచివుంది. అటుతర్వాత, ఆ తల్లి ఈమె దగ్గరకు వచ్చి ఇలా అంది: “మీ భర్త నా కుటుంబానికి సహాయం చేయడానికి వెచ్చించిన సమయం కోసం మీకు నిజంగా థాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను.” మెప్పుదల నిండిన ఆ కొద్ది మాటలు, ఆమె హృదయాన్ని నిజంగా తాకాయి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి