-
పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టికావలికోట—1991 | జూన్ 1
-
-
8 ఈ లోక లౌకిక అధికారులకు మనము లోబడవలెనని పేతురుకూడ స్థిరముగా చెప్పుచున్నాడు. ఆయనిట్లనెను: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.” (1 పేతురు 2:13, 14) దీనికి అనుగుణ్యముగా, పౌలు తిమోతికి ఇచ్చిన ఉపదేశమును కూడ క్రైస్తవులు లక్ష్యపెట్టుదురు: “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నింటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును ఉన్నతస్థానమందున్న వారందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.”b—1 తిమోతి 2:1, 2 NW.
-
-
పై అధికారుల విషయములో క్రైస్తవుల దృష్టికావలికోట—1991 | జూన్ 1
-
-
b “ఉన్నతస్థానమందున్నవారు” అని తర్జుమా చేయబడిన గ్రీకు నామవాచకమగు, హైపరొకె, క్రియా పదమగు హైపరెకొ కు సంబంధమును కలిగియున్నది. “పైఅధికారులు” అను పదమందలి “పై” ఈ గ్రీకు క్రియా పదమునుండి వచ్చినదే, ఇది పైఅధికారులు లౌకిక అధికారులనుటకు రుజువును మరింత ఇనుమడింపజేయుచున్నది. ది న్యూ ఇంగ్లీషు బైబిలు రోమీయులు 13:1 ను “ప్రతివ్యక్తి తప్పక సర్వోన్నత అధికారులకు లోబడియుండవలెను” అని తర్జుమా చేయుట సరికాదు. ఇతర మానవులకంటె పైన ఉన్నను, “ఉన్నతస్థానమందున్న” మానవులు సర్వోన్నతులు కారు.
-