-
బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచిందికావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది (brwp1604) | కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది (brwp1604)
-
-
త్రిత్వ సిద్ధాంతం: బైబిలు రాయడం పూర్తై 300 సంవత్సరాలు అవ్వకముందే, త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే ఒక రచయిత 1 యోహాను 5:7 కు ఈ మాటలు కలిపాడు. “పరలోకంలో తండ్రి, వాక్యం, పవిత్రశక్తి ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కటే.” కానీ ఈ మాటలు మూలప్రతిలో లేవు. “అయితే, ఆరవ శతాబ్దం మొదలుకొని ప్రాచీన లాటిన్ రాతప్రతుల్లో, లాటిన్ వల్గేట్‌లో ఈ మాటలు ఎక్కువగా కనిపించాయి,” అని ఒక బైబిలు నిపుణుడు రాశాడు.
-
-
బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచిందికావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది (brwp1604) | కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది (brwp1604)
-
-
రెండవ కారణం పరిశీలించండి. నేడు అనేక రాతప్రతులు అందుబాటులో ఉండడం వల్ల, బైబిలు నిపుణులు వాటిని ఒకదానితో మరొకటి పోల్చి తప్పుల్ని గుర్తించగలిగారు. ఉదాహరణకు, లాటిన్ బైబిలు అనువాదమే ఖచ్చితమైనదని మతనాయకులు కొన్ని శతాబ్దాల పాటు బోధిస్తూ వచ్చారు. కానీ వాళ్లు, మూలప్రతుల్లో లేని కొన్ని మాటల్ని 1 యోహాను 5:7 లో చేర్చారని పై పేరాల్లో తెలుసుకున్నాం. వాళ్లు చేర్చిన ఆ మాటలు ప్రసిద్ధి చెందిన ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వర్షన్‌లో కూడా కనిపించాయి! అయితే కొంతకాలానికి, వివిధ భాషల్లో ఉన్న అతిపురాతనమైన కొన్ని రాతప్రతులు బయటపడ్డాయి. అవి పరిశీలించి ఈ మాటలు వాటిలో లేవని నిపుణులు నిర్ధారించారు. దాంతో కింగ్ జేమ్స్ వర్షన్ రివైజ్డ్ ఎడిషన్‌లలో, ఇంకా ఇతర బైబిళ్లలో ఆ మాటల్ని తీసేశారు.
-