-
యెహోవా తూరు గర్వాతిశయమును అపవిత్రపరుస్తాడుయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
32. యోహాను ఏ హెచ్చరికనిచ్చాడు, దాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు?
32 మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎల్లప్పుడూ రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు” అని చెప్పిన అపొస్తలుడైన యోహాను మాటలను మనం ఎన్నడూ మరచిపోకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. (1 యోహాను 2:15) నిజమే, మనం జీవించడానికి ఈ ప్రపంచపు ఆర్థిక ఏర్పాట్లను ఉపయోగించుకోవలసిందే. (2 థెస్సలొనీకయులు 3:10) కాబట్టి, మనం ‘ఈ లోకమును’ ఉపయోగించుకుంటాము గానీ దాన్ని “అమితముగా” ఉపయోగించుకోము. (1 కొరింథీయులు 7:31) వస్తుసంపదల పట్ల అంటే లోకంలో ఉన్నవాటి పట్ల మనకు విపరీతమైన మక్కువ ఉంటే, మనం ఇక యెహోవాను ప్రేమించలేము. ‘శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముల’ కోసం ప్రాకులాడడమూ, దేవుని చిత్తాన్ని చేయడమూ పరస్పర విరుద్ధమైనవి.d అయితే దేవుని చిత్తాన్ని చేయడమే నిత్యజీవానికి నడిపిస్తుంది.—1 యోహాను 2:16, 17.
-
-
యెహోవా తూరు గర్వాతిశయమును అపవిత్రపరుస్తాడుయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
d “డంబము” అని అనువదించబడిన అలజోనీ అనే గ్రీకు మూలపదం, “లోకసంబంధమైన వాటి స్థిరతను నమ్ముకునే భక్తిరహితమైన, అర్థరహితమైన గర్వం” అని వర్ణించబడుతుంది.—ది న్యూ థేయర్స్ గ్రీక్-ఇంగ్లీష్ లెక్సికాన్.
-