-
యేసు నామమును హత్తుకొని ఉండుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
14. (ఎ) ముందునుండి, క్రైస్తవ సంఘం ఎవరితో పోరాడవలసి వచ్చింది, మరి అపొస్తలుడైన పౌలు వారినెలా వర్ణించాడు? (బి) విడిపోయిన గుంపుతో వెళ్లాలనుకునే వారెవరైనాసరే యేసు చెప్పిన ఏ మాటల్ని లక్ష్యపెట్టాలి?
14 ముందునుండి కూడా, క్రైస్తవసంఘం వారి మృదువైన, మోసపూరిత మాటలతో యెహోవా మార్గం ద్వారావచ్చే “బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారి,”తో అనగా అహంకార మతభ్రష్టులతో పోరాడవలసి వచ్చింది. (రోమీయులు 16:17, 18) అపొస్తలుడైన పౌలు తాను పంపిన అన్ని పత్రికలలో యీ అపాయాన్నిగూర్చి హెచ్చరిస్తూనే వచ్చాడు.a ఆధునిక కాలంలో, యేసు నిజమైన క్రైస్తవసంఘాన్ని దాని పరిపూర్ణతకు, ఐక్యతకు పునరుద్ధరించినప్పుడు, భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున, విడిపోయిన గుంపు ననుసరించాలని తలంచే ఏ వ్యక్తియైనా, తదుపరి యేసు చెప్పినమాటలను లక్ష్యపెట్టాలి. “కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను.”—ప్రకటన 2:16.
-
-
యేసు నామమును హత్తుకొని ఉండుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
16. (ఎ) మతభ్రష్టుల ప్రభావం మూలంగా అస్థిరులైన వారెందుకు వెంటనే పశ్చాత్తాపపడాలి? (బి) పశ్చాత్తాప పడడానికి తిరస్కరించే వారికేమౌతుంది?
16 మతభ్రష్టుల ప్రభావంవల్ల ఊగిసలాడే వారెవరైన పశ్చాత్తాప పడాలని యేసు యిచ్చిన సలహాను పాటించడానికి వేగిరపడాలి. మతభ్రష్టుల ప్రచారాన్ని విషమేనని త్రోసివేయాలి. యేసు తన సంఘాన్ని పోషించే నీతి, పవిత్రత, ప్రేమగల సత్యాలకు భిన్నంగా అది ఈర్ష్యాద్వేషాలమీద ఆధారపడింది. (లూకా 12:42; ఫిలిప్పీయులు 1:15, 16; 4:8, 9) పశ్చాత్తాపపడని వారితో ప్రభువైన యేసు నిశ్చయంగా “[తన] నోటనుండి వచ్చు ఖడ్గముచేత . . . యుద్ధము చేయును.” ఆయన భూమ్మీద తానున్న చివరిరాత్రి తన శిష్యులతో గడిపినప్పుడు ప్రార్థించిన ఐక్యతను కాపాడడానికి ఆయన తనశిష్యులను గాలిస్తున్నాడు. (యోహాను 17:20-23, 26) తన చేతిలోని నక్షత్రాలు యిచ్చే ప్రేమాపూర్వక సహాయ సలహాలను మతభ్రష్టులు తిరిస్కరిస్తున్నారు గనుకనే యేసు వారిని ‘తీవ్రమైన’ తీర్పుతో శిక్షిస్తాడు, “వెలుపల అంధకారము” లోనికి త్రోసివేస్తాడు. వారు బహిష్కరింప బడినవారు, దేవుని ప్రజల్లో యిక పులిసిన పిండిగా వుండరు.—మత్తయి 24:48-51; 25:30; 1 కొరింథీయులు 5:6, 9, 13; ప్రకటన 1:16.
-