-
ముదటి శ్రమ—మిడతలుప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
9. మిడతలు యుద్ధానికి సంబంధించిన ఎటువంటి ఆజ్ఞలను అందుకున్నాయి?
9 యుద్ధాన్ని గూర్చిన ఏ ఆజ్ఞలు యీ మిడతలకు జారీ చేయబడ్డాయి? యోహానిలా నివేదిస్తున్నాడు: “మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలన కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.”—ప్రకటన 9:4-6.
-
-
ముదటి శ్రమ—మిడతలుప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
11. (ఎ) మిడతలు ఎంతకాలం దేవుని శత్రువులను బాధిస్తూ ఉండాలి, మరి అదెందుకంత తక్కువ కాలమేమీ కాదు? (బి) ఆ బాధ ఎంత తీవ్రమైంది?
11 ఆ బాధ ఐదునెలల వరకూ ఉంటుంది. అదంత తక్కువ సమయమేనా? నిజమైన మిడతల విషయంలోమాత్రం కాదు. ఐదు నెలలంటే సాధారణంగా యీ ప్రాణులు జీవించే కాలమన్నమాట. అందుచేత, ఆధునిక మిడతలు జీవించినంతకాలం దేవుని శత్రువులను బాధిస్తూ ఉంటాయని అర్థం. అంతేగాక, బాధ ఎంత విపరీతంగా ఉంటుందంటే మనుష్యులు చావాలనుకుంటారు. నిజమే, మిడతలు కుట్టిన వారెవరన్నా చావడానికి ప్రయత్నించినట్లు మనకు దాఖలాలేమీ లేవు. అయితే ఆ మాటమాత్రం వాటివల్ల కల్గేబాధ ఎంతతీవ్రమైందో—తేలు కుట్టినంత బాధాకరమైన పోటువంటిదని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అది, బబులోనీయులచేత తరుమబడి, బ్రతకడంకన్నా మరణమే మంచిదనుకునే భ్రష్టులైన ఇశ్రాయేలీయులకు సంభవింపబోవు బాధను యిర్మీయా ముందే ఊహించిన మాదిరిగానే ఉంది.—యిర్మీయా 8:3; ప్రసంగి 4:2, 3 కూడ చూడండి.
-