-
దేవుని రాజ్యం ఆరంభమైంది!ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
11. ఆ స్త్రీ శిశువును ప్రసవించే విషయాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు, మరి ఆ శిశువెందుకు ‘కుమారుడు, మగశిశువు’ అని పిలువబడ్డాడు?
11 దేవుని జోక్యం లేకుండ పరిపాలించే అన్యరాజుల పాలన 1914 లో అంతమైంది. (లూకా 21:24) ఇక ఆ స్త్రీ సరిగ్గా సమయానికి తన శిశువును ప్రసవిస్తుంది: “సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును (కుమారుని, ఒక మగశిశువును, NW.) ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.” (ప్రకటన 12:5, 6) ఆ శిశువు ‘ఒక కుమారుడు, మగశిశువు’ అని యోహాను ఎందుకు రెండు పదాలను ఉపయోగిస్తున్నాడు? శిశువు తగిన అధికారంతో జనములను పాలించే యోగ్యతను సామర్థ్యతను చూపించడానికే ఆయనలా అంటున్నాడు. ఈ పుట్టుక ఎంతటి ఆనందాన్ని, మధుర క్షణాల్ని తెస్తుందోకూడ అది నొక్కితెల్పుతుంది! దేవుని పరిశుద్ధ మర్మాన్ని సంపూర్తి గావించడంలో కూడ అది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇంతెందుకు, యీ మగశిశువు “జనములను ఇనుపదండముతో ఏలును”!
-
-
దేవుని రాజ్యం ఆరంభమైంది!ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
13.ఆ మగశిశువు “దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడడం” దేనిని తెలియజేస్తుంది?
13 యెహోవా తన భార్యనుగాని లేదా క్రొత్తగా జన్మించిన తన కుమారునిగాని సాతాను మ్రింగడానికి అనుమతించడు! జన్మించగానే, ఆ శిశువు “దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.” అలా ఆ శిశువు సంపూర్తిగా యెహోవా సంరక్షణ క్రిందికి వస్తున్నాడు, ఆయన క్రొత్తగా జన్మించిన యీ శిశువును, ఆయన పరిశుద్ధ నామమును పరిశుద్ధ పరచడంలో ఆయనకున్న ఉపకరణాన్ని, అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే సమయములో, ఆ స్త్రీ దేవుడామెకు ఏర్పాటు చేసిన అరణ్యంలోనున్న స్థలానికి వెళ్తుంది. దాన్ని గూర్చిన వివరాలు తర్వాత తెలుసుకుందాం! సాతాను విషయంలోనైతే, పరలోకమందున్న రాజ్యాన్ని అతడెన్నటికిని బెదిరించకుండా పూర్తిగా అసాధ్యమయ్యేలా చేసే ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి జరగడానికి రంగం యిప్పుడు సిద్ధం చేయబడింది. ఏమిటా సంఘటన?
-