కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దేవుని రాజ్యం ఆరంభమైంది!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • 22, 23. (ఎ) ఘటసర్పం భూమ్మీదికి పడద్రోయబడిన తర్వాత జరిగే విషయాన్ని గూర్చి యోహాను ఏమని చెబుతున్నాడు? (బి) “మగశిశువును కనిన ఆ స్త్రీని” హింసించడం ఘటసర్పానికెలా సాధ్యమౌతుంది?

      22 సాతాను వినాశకరరీతి బహిష్కరణ మొదలుకొని, క్రీస్తు సహోదరులు భూమ్మీద యింకనూ అతని కోపాగ్నిజ్వాలల్ని భరిస్తూనేవున్నారు. యోహాను యిలా నివేదిస్తున్నాడు: “ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుటచూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను; అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.”—ప్రకటన 12:13, 14.

  • దేవుని రాజ్యం ఆరంభమైంది!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • 24. ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులు విడుదలైనప్పుడు పొందిన అనుభవం లాంటి ఏ అనుభవాన్ని బైబిలు విద్యార్థులు కల్గివుండిరి?

      24 మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు, యేసు సహోదరులు సాధ్యమైనంతవరకు నమ్మకంగా సాక్ష్యమిస్తూనే యున్నారు. సాతాను, క్రూరులైన వాని తొత్తులు పెట్టిన తీవ్రహింసల్లో యిలా సాక్ష్యమిచ్చారు. చివరకు బైబిలు విద్యార్థుల బహిరంగ సాక్ష్యం దాదాపుగా నిలిచిపోయింది. (ప్రకటన 11:7-10) ఐగుప్తులో ఇశ్రాయేలీయులు కూడ సహించిన గొప్ప హింసవంటి దానినే వీరు అనుభవించారు. అప్పుడే యెహోవా వారిని, గద్ద రెక్కలమీద అన్నట్లుగా, సీనాయి పర్వతారణ్యంలోని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. (నిర్గమకాండము 19:1-4) అలాగే, 1918-19 లలో వచ్చిన తీవ్రహింస తర్వాత, యెహోవా తన స్త్రీకి ప్రతినిధులైన, తనసాక్షులను విడుదల చేసి, ఇశ్రాయేలీయులకు అరణ్యమెలా సురక్షితంగా ఉండెనో, అటువంటి ఆత్మీయ పరిస్థితిలోనికి తెచ్చాడు. ఇది వారి ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా జరిగింది.—కీర్తన 55:6-9 పోల్చండి.

      25. (ఎ) అరణ్యంలో ఇశ్రాయేలీయులకు చేసినట్లే యెహోవా 1919 లో ఏమి చేశాడు? (బి) ఎవరు యీ జనాంగంలో చేరియున్నారు, మరి వారు దేనిలోనికి తీసుకురాబడ్డారు?

      25 అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులను ఆత్మీయ, భౌతికాహారాన్నిస్తూ వారినొక జనాంగముగా ఏర్పాటుచేశాడు. అలాగే, 1919 నుండి యెహోవా, స్త్రీ సంతానాన్ని ఆత్మీయ జనాంగముగా చేశాడు. దీన్ని, 1914 నుండి పరిపాలిస్తున్న మెస్సీయ రాజ్యంతోకలిపి గందరగోళం చేయకూడదు.ఈ ఆత్మీయ క్రొత్త జనాంగము అంటే 1919 లో మహిమాన్విత ఆత్మీయ స్థితిలోనికి తీసుకురాబడిన అభిషక్తులైన సాక్షులలో శేషమునకు సంబంధించిన సభ్యులతోకూడినదే. అప్పుడు “తగిన కాలమున ప్రతివానికి ఆహారము” ఏర్పాటు చేయబడుతున్నందున, వారెదుటవున్న పనిని చేయడానికి వారు బలపర్చబడ్డారు.—లూకా 12:42; యెషయా 66:8.

      26. (ఎ) ప్రకటన 12:6, 14 లో చెప్పబడిన కాలం ఎంతకాలం? (బి) మూడున్నర కాలముల ఉద్దేశమేమై యుండెను, అదెప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు అంతమయ్యింది?

      26 దేవుని స్త్రీ సంతానానికి ఎంతకాలం యీ విశ్రాంతి లభించింది? ప్రకటన 12:6 ఆ కాలం 1,260 దినములని చెబుతుంది. ప్రకటన 12:14 ఆ కాలాన్ని ఒక కాలం, కాలములు, అర్ధకాలమని అంటే, మూడున్నర కాలములని అంటోంది. వాస్తవానికి, ఆ రెండు మాటలును, 1919 లోని ఉత్తరాయణపు వసంత కాలం నుండి 1922 లోని హేమంత రుతువు వరకున్న మూడున్నర సంవత్సరాలకు సూచనగా ఉన్నాయి. పునరుద్ధరింపబడిన యోహాను తరగతికి యీ కాలం సేదదీర్చుకోవడానికి, పునరారోగ్య ప్రాప్తికి, పునః సంస్థీకరణకు సమయమై యుండెను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి