-
రెండు భయంకరమైన మృగాలతో పోరాడుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
25. (ఎ) ప్రపంచ రంగంమీదికి వస్తున్న మరో సాదృశ్యమైన క్రూరమృగాన్ని గూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) ఈ క్రొత్త క్రూరమృగము యొక్క రెండు కొమ్ములు, అది భూమిలోనుండి పైకిరావడం దేన్ని సూచిస్తుంది?
25 అయితే యిప్పుడు మరో క్రూరమృగము ప్రపంచరంగంలో దిగుతుంది. యోహాను యిలా తెల్పుతున్నాడు: “మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండుకొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.” (ప్రకటన 13:11-13) రెండు రాజకీయ శక్తుల కలయికను సూచించడానికే ఈ క్రూరమృగానికి రెండు కొమ్ములున్నాయి. మరియు అది సముద్రములోనుండి గాక భూమిలో నుండి వస్తున్నట్లు వర్ణించబడింది. అలా, అది సాతాను యిదివరకే స్థాపించిన పరిపాలనా విధానమునుండి వస్తుంది. అది అప్పటికేవుండి ప్రభువు దినములో ప్రముఖ స్థానం వహించే, ప్రపంచ ఆధిపత్యమై యుండాలి.
-
-
రెండు భయంకరమైన మృగాలతో పోరాడుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
27. (ఎ) రెండు కొమ్ములుగల క్రూరమృగము ఆకాశమునుండి అగ్ని కురిపిస్తుందంటే, దాని ఏ స్వభావం బయల్పర్చబడుతుంది? (బి) రెండుకొమ్ములుగల క్రూరమృగము యొక్క ఆధునిక ప్రతిరూపాన్ని అనేకమంది ప్రజలు ఎలా దృష్టిస్తున్నారు?
27 ఈ రెండుకొమ్ములుగల క్రూరమృగము గొప్పసూచక క్రియలను చేస్తోంది, ఆకాశమునుండి అగ్ని దిగివచ్చేలాంటి వాటిని సహితం చేస్తుంది. (మత్తయి 7:21-23 పోల్చండి.) తర్వాత చెప్పబడిన సూచక క్రియ బయలు ప్రవక్తలతో పోటికి దిగినప్పుడు పూర్వకాలంలో దేవుని ప్రవక్తయగు ఏలియా చేసిన సూచనను జ్ఞాపకం చేస్తుంది. ఆయన యెహోవా నామమున ఆకాశమునుండి అగ్నిని కురిపించినప్పుడు, ఆయన నిజమైన ప్రవక్తయని, బయలు ప్రవక్తలు అబద్ధికులని నిస్సందేహంగా నిరూపించబడింది. (1 రాజులు 18:21-40) ఆ బయలు ప్రవక్తలవలె, రెండు కొమ్ములుగల క్రూరమృగం తనకు ఒక ప్రవక్తగా తగినన్ని అర్హతలున్నాయని అనుకుంటుంది. (ప్రకటన 13:14, 15; 19:20 పోల్చండి.) ఇంతెందుకు, రెండు ప్రపంచయుద్ధాల్లో దుష్టశక్తులను ఓడించి యిప్పుడిది దైవభక్తిలేనిదని పిలువబడే కమ్యూనిజానికి వ్యతిరేకియై స్థిరంగా నిలబడిందని చెప్పుకుంటోంది! నిజానికి, అనేకులు రెండుకొమ్ములుగల క్రూరమృగం యొక్క ఆధునిక ప్రతిరూపాన్ని స్వేచ్ఛను రక్షించేదని, వస్తురూపకమైన మంచివాటికి నెలవు అని అనుకుంటున్నారు.
-