-
అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
13. దూత ఆత్మవశుడైన యోహానును అరణ్యానికి కొనిపోయినప్పుడు ఆయన ఏ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూస్తాడు?
13 మహా వేశ్యను, దాని భవిష్యత్‌ను గూర్చి ప్రవచనం యింకా ఏమి బయల్పరుస్తుంది? యోహాను యిప్పుడు తెలియజేసే విధంగా, యింకా స్పష్టమైన దృశ్యం కనబడుతోంది: “అప్పుడతడు [దూత] ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.”—ప్రకటన 17:3.
-
-
అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుటప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
15. ప్రకటన 13:1 లోని క్రూరమృగమునకు ప్రకటన 17:3 లోని మృగానికి ఏమేమి తేడాలున్నాయి?
15 ఈ క్రూరమృగానికి ఏడుతలలు పదికొమ్ములు ఉన్నాయి. ఇది యోహాను ముందుచూసిన ఏడుతలలు పదికొమ్ములున్న క్రూరమృగము వంటిదేనా? (ప్రకటన 13:1) కాదు, కొన్ని తేడాలున్నాయి. ఇది ఎఱ్ఱని క్రూరమృగము, ముందున్న క్రూరమృగము వలెగాక దీనికి కిరీటాలున్నట్లు చెప్పబడలేదు. ఏడు తలలమీద మాత్రమే గాక, అది “దేవదూషణలుగల నామములతో నిండుకొని”యున్నది. అయినప్పటికీ, యీ క్రొత్త క్రూరమృగానికి ముందున్నదానికి సంబంధముండి తీరాలి; వాటిమధ్యగల సారూప్యాలు కూడ సమంగా ఉన్నట్లు చెప్పబడుతున్నాయి.
16. ఎఱ్ఱని క్రూరమృగము ఏమైయున్నది, దాని ఉద్దేశమును గూర్చి ఏమి తెలుపబడింది?
16 మరైతే యీ ఎఱ్ఱని క్రూరమృగమేమై యున్నది? అది గొఱ్ఱెపిల్లవంటి రెండుకొమ్ములుగల ఆంగ్లో-అమెరికన్ క్రూరమృగము విజ్ఞప్తిమేరకు తయారైన క్రూరమృగముయొక్క ప్రతిమయై వుంటుంది. ప్రతిమ తయారైన తర్వాత, రెండుకొమ్ములుగల క్రూరమృగము యీ క్రూరమృగముయొక్క ప్రతిమకు జీవమివ్వడానికి అనుమతించబడింది. (ప్రకటన 13:14, 15) యోహాను యిప్పుడు ప్రాణంతో ఉండి శ్వాసిస్తున్న ప్రతిమను చూస్తున్నాడు. రెండు కొమ్ములుగల క్రూరమృగము 1920 లో తెచ్చిన నానాజాతి సమితిని అది సూచిస్తుంది. ఈ సమితి “మనుష్యులందరికి న్యాయంచేకూర్చి, యుద్ధాన్ని శాశ్వతంగా నిర్మూలించే న్యాయస్థానమై వుంటుంది” అని అమెరికా అధ్యక్షుడు విల్సన్ కలలు కన్నాడు. రెండవప్రపంచ యుద్ధానంతరం అది మరల లేపబడినప్పుడు, దాని అధికారిక శాసనం ప్రకారం అది “అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడవలసి” యుండెను.
-