-
క్రైస్తవమత సామ్రాజ్యం మీద యెహోవా తెగుళ్లుప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
29. “దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము” అనే దాని సూచనను ఏది నెరవేరుస్తుంది, ఎందుకు?
29 యేసు ఏడు సంఘాలకిచ్చిన వర్తమానములలో నక్షత్రాన్ని గూర్చిన సూచనార్థక భావాన్ని మనమిదివరకే గమనించాము, అందులో ఆ ఏడు నక్షత్రాలు పెద్దలను సూచిస్తున్నాయి.b (ప్రకటన 1:20) అభిషక్తులైన “నక్షత్రాలు,” మిగిలిన అభిషక్తులందరితోపాటు, వారి పరలోక స్వాస్థ్యమునకు గుర్తుగా పరిశుద్ధాత్మచే ముద్రింప బడినప్పటినుండి ఆత్మీయార్థంలో పరలోక స్థలాలను స్వతంత్రించుకుంటారు. (ఎఫెసీయులు 2:6, 7) అయిననూ, అటువంటి నక్షత్రాల్లాంటి వారిలోనుండే మందను తప్పుదారికి మళ్లించే మతభ్రష్టులు, విమతస్థులు బయల్దేరుతారని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 30) అట్టి అవిశ్వాస్యత మూలంగా గొప్ప మతభ్రష్టత సంభవిస్తుంది, యీ పడిపోయిన పెద్దలంతా కలిసికట్టుగా ధర్మవిరోధి అవుతారు, అతడు మానవజాతిలో తననుతాను దేవునిగా చేసుకుంటాడు. (2 థెస్సలొనీకయులు 2:3, 4) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు ప్రపంచ రంగంమీద దర్శనమిచ్చినప్పుడు పౌలు హెచ్చరికలు నేరవేరాయి. ఈ గుంపు “దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము” అనే గుర్తుతో సరిగ్గానే సూచించబడింది.
-
-
క్రైస్తవమత సామ్రాజ్యం మీద యెహోవా తెగుళ్లుప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
-
-
b యేసు కుడిచేతిలోని ఏడు నక్షత్రాలు క్రైస్తవసంఘంలోని అభిషక్త అధ్యక్షులను సూచిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 73,000 కంటె ఎక్కువ సంఘాలలోని పెద్దలలో ఎక్కువమంది గొప్పసమూహములోని వారే. (ప్రకటన 1:16; 7:9) వారి స్థానమేమిటి? వారు అభిషక్తులైన నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని తరగతినుండి వారి నియామకములను పొందుతున్నందున, వీరు యేసు కుడిచేయి అధీనంలో ఉన్నారని చెప్పవచ్చు, ఎందుకంటే, వారుకూడా ఆయన ఉపకాపరులే. (యెషయా 61:5, 6; అపొస్తలుల కార్యములు 20:28) అర్హతగల, అభిషక్త సహోదరులు లేనిచోట సేవచేయడంద్వారా వారు “ఏడు” నక్షత్రాలకు మద్దతునిస్తారు.
-