కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • పరిశుద్ధ మర్మమును బయలుపరచుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • 16. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు ప్రత్యేకంగా ఎవరిమీద ద్వేషాన్ని కనబరుస్తున్నారు? (బి) మధ్యయుగంలో క్రైస్తవమత సామ్రాజ్యమందేమి సంభవించింది? (సి) ప్రొటెస్టెంట్‌ తిరుగుబాటు లేక సంస్కరణ క్రైస్తవమత సామ్రాజ్యపు పద్ధతుల నేమైనా మార్చిందా?

      16 తాము దేవుని మందకాపరులమని చెప్పుకుంటూనే, క్రైస్తవమత సామ్రాజ్య మత రాజకీయ నాయకులు బైబిలును చదవాలని ప్రోత్సహించేవారియెడల, లేదా లేఖన విరుద్ధమైన వారి ఆచారాలను బహిర్గతం చేసేవారియెడల ఓ ప్రత్యేక ద్వేషాన్ని కనబర్చారు. జాన్‌హస్‌ను అలాగే బైబిల్‌ అనువాదకుడైన విలియం టిండేల్‌ను హింసించి చంపారు. అంధకారం అలుముకున్న మధ్యయుగాలలో, మతభ్రష్టుల పాలన, కాథోలిక్కులు నిర్వహించిన పాపిష్టి విచారణా నిర్వాహకంతో శిఖరాగ్రం చేరింది. చర్చి అధికారాన్ని లేక బోధలను వ్యతిరేకించిన వారు నిర్థాక్షిణ్యంగా అణచివేయబడ్డారు, యింకా భిన్నమత అవలంబీకులని పిలువబడిన అసంఖ్యాకులను హతమార్చారు లేక వ్రేలాడదీసి కాల్చివేశారు. ఆ విధంగా, దేవుని స్త్రీనిపోలిన సంస్థయొక్క నిజమైన సంతానాన్ని వెంటనే తుదముట్టించాలని సాతాను విశ్వప్రయత్నం చేశాడు. ప్రొటెస్టెంట్‌ తిరుగుబాటు లేక సంస్కరణ జరిగినప్పుడు (1517 మొదలుకొని) పలు ప్రొటెస్టెంట్‌ చర్చీలు అలాంటి అసహన స్వభావాన్నే కనబరచాయి. వారు కూడ దేవునికి క్రీస్తుకు యథార్థత చూపిన వారిని హతమార్చుటద్వారా రక్తాపరాధులయ్యారు. నిజంగా, “పరిశుద్ధుల రక్తమును” యథేఛ్ఛగా చిందించారు!—ప్రకటన 16:6; మత్తయి 23:33-36ను పోల్చండి.

  • పరిశుద్ధ మర్మమును బయలుపరచుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • [31వ పేజీలోని చిత్రం]

      బైబిలును అనువదించినవారిని, చదివినవారిని, లేక కలిగివున్నవారిని సహితం హింసించి, చంపడం మూలంగా, క్రైస్తవమత సామ్రాజ్యం మహా రక్తాపరాధియైంది

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి