కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుట
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • 25. (ఎ) ‘ఏహ్యమైన కార్యములతో నిండిన సువర్ణపాత్ర’లోనివి దేనిని సూచిస్తున్నాయి? (బి) ఆ సాదృశ్యమైన వేశ్య ఏ భావంలో మత్తిల్లియున్నది?

      25 ఆ వేశ్య చేతిలో ఉన్నదాన్ని యిప్పుడు చూడండి. “తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతో నిండిన” ఒక సువర్ణపాత్రను పట్టుకొనియుండుట యోహాను చూచి ఊపిరి బిగపట్టుకొని యుండవచ్చును! అది సమస్త జనులను తన మోహోద్రేకముతో కూడిన “వ్యభిచారమద్యమును” త్రాగించినపాత్ర యిదే. (ప్రకటన 14:8; 17:2) దాని పై ఆకారం అందంగానేవుంది, గానీ లోపల అసహ్యమైనవి, అపవిత్రమైనవి ఉన్నాయి. (మత్తయి 23:25, 26 పోల్చండి.) ఆ మహావేశ్య జనములను మోసగించి, వారిని తన వశంచేసుకోవడానికి తాను ఉపయోగించిన అసహ్యమైన అభ్యాసములు, అబద్ధాలు అందులో ఉన్నాయి. యోహాను యింకా చూసిన అసహ్యకరమైన దేమంటే, ఆ వేశ్య తానే దేవుని దాసుల రక్తముతో మత్తిల్లియున్నది! నిజానికి, “ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెనని” తర్వాత మనం చదువుతాము. (ప్రకటన 18:24) ఎంత గొప్ప రక్తాపరాధమోగదా!

      26. మహాబబులోను రక్తాపరాధియనడానికి ఏ సాక్ష్యాధారమున్నది?

      26 శతాబ్దాలతరబడి, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం సముద్రాలంత రక్తాన్ని చిందించింది. ఉదాహరణకు, మధ్యయుగంలో జపాన్‌నందలి క్యోటోలోని దేవాలయాలను కోటలుగా మార్చారు, అందులో యుద్ధ-సన్యాసులు, “బుద్ధుని పవిత్ర నామాన్ని” ఉచ్చరిస్తూ, వీధులన్నీ ఎఱ్ఱగా రక్తంతో ఏరులై పారేవరకు యుద్ధం చేశారు. ఈ 20వ శతాబ్దంలో, క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు వారివారి దేశాల సేనలతోపాటు నడిచారు, వీరు ఒకరినొకరు చంపుకున్నారు, కనీసం పదికోట్లమంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 1987 లో అమెరికా మాజీ అధ్యక్షుడైన నిక్సన్‌ యిలా అన్నాడు: “ఈ 20వ శతాబ్దమే చరిత్రయంతటిలోకెల్లా అత్యధిక రక్తాన్ని చిందించింది. శతాబ్దారంభం కాకముందు జరిగిన యుద్ధాలన్నింటిలోను చంపబడిన వారందరికంటె ఎక్కువ యీ శతాబ్దంలోని యుద్ధాల్లో చంపబడ్డారు.” వీటన్నింటిలోను ప్రపంచమతాలు భాగం వహించినందుకుగాను దేవుడు వారికి ప్రతికూల తీర్పు తీరుస్తాడు; “నిరపరాధులను చంపు చేతులు” యెహోవాకు హేయములు. (సామెతలు 6:16, 17) అంతకు ముందు యోహాను బలిపీఠంనుండి వచ్చిన కేకలను యిలా విన్నాడు: “నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.” (ప్రకటన 6:10) వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లియైన మహాబబులోను, ఆ ప్రశ్నకు సమాధానము చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు అది పీకలలోతు కష్టాల్లో కూరుకు పోతుంది.

  • ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
    • 1. (ఎ) ఆ మహావేశ్యను అది స్వారీచేసే భయంకర దృశ్యాన్ని చూసి ఎలా యోహాను స్పందించాడు, ఎందుకు? (బి) ప్రవచనార్థక దర్శన నెరవేర్పు ప్రకారం సంఘటనలు బయల్పర్చబడుచుండగా, యోహాను తరగతి యీ నాడెలా స్పందిస్తుంది?

      ఆ మహావేశ్యను, అది స్వారీచేసే భయంకరమైన మృగాన్ని చూస్తున్నప్పుడు యోహాను ప్రతిస్పందన ఏమిటి? ఆయనే స్వయంగా యిలా సమాధానమిస్తున్నాడు: “నేను దానిచూచి బహుగా ఆశ్చర్యపడితిని.” (ప్రకటన 17:6బి) అలాంటి దృశ్యం మానవ ఊహకు ఎన్నటికీ అందనిది. అయిననూ, అదిగో అక్కడే ఉందది—దూరంగా అరణ్యంలో—భయంకరమైన, ఎఱ్ఱని క్రూరమృగంమీద కూర్చొనివుంది! (ప్రకటన 17:3) ప్రవచనార్థక దృశ్యం యొక్క నెరవేర్పు ప్రకారం సంఘటనలు బయల్పర్చ బడుచుండగా యోహాను తరగతికూడ యీనాడు బహుగా ఆశ్చర్యపడుతోంది. లోకంలోని ప్రజలు చూడగల్గితే, వారు ‘అబ్బా!’ అని అంటారు, లోకపాలకులైతే అది ‘ఊహాతీతమే!’ అని ప్రతిధ్వనించేలా పలుకుతారు. అయితే ఆ దర్శనం 20వ శతాబ్దపు విస్మయమొందించే వాస్తవమౌతుంది. దేవుని ప్రజలు యిప్పటికే ఆ దర్శన నెరవేర్పులో ప్రాముఖ్యమైన భాగం కల్గివున్నారు, మరియు ఆ ప్రవచనం దాని ఆశ్చర్యకరమైన అంతిమ నెరవేర్పుకు చేరుతుందని యిది వారికి అభయమిస్తోంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి