-
అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
అపవాది. (ప్రకటన 20:10) అపవాది ఆత్మ ప్రాణి కాబట్టి అతనికి అగ్నివల్ల ఎటువంటి హాని జరగదు.—నిర్గమకాండము 3:2; న్యాయాధిపతులు 13:20.
-
-
అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
ఎలా “యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు”?
అగ్నిగుండం నాశనానికి సూచనైతే, మరి బైబిలు ఎందుకు దానిలో అపవాది, క్రూరమృగము, అబద్ధప్రవక్త “యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు” అని చెప్తుంది. (ప్రకటన 20:10) ఇక్కడ చెప్తున్న బాధించడం నిజంగా హింసించడం కాదు అనడానికి నాలుగు కారణాలను గమనించండి:
అపవాదిని నిత్యం హింసించాలంటే, అతడు ఎప్పటికీ చనిపోకూడదు. కాని అతడు నశిస్తాడని బైబిలు చెప్తుంది.—హెబ్రీయులు 2:14.
నిత్యజీవితం దేవుడు ఇచ్చిన బహుమతే కాని శిక్ష కాదు.—రోమీయులు 6:23.
క్రూరమృగం, అబద్ధప్రవక్త సూచనార్థకమైనవి, కాబట్టి నిజంగా హింసను అనుభవించలేరు.
బైబిలు ఈ సందర్భంలో అపవాదిని హింసించడం అంటే నిత్యము నిర్బంధించడాన్ని లేదా నిత్యనాశనాన్ని సూచిస్తుంది.
బైబిల్లో “బాధించడం” అనే పదాన్ని “నిర్బంధంలో ఉంచే స్థితి” అనే భావంలో కూడ ఉపయోగించారు. ఉదాహరణకు, మత్తయి 18:34 లో ఉన్న “బాధపరచువారు” అనే గ్రీకు పదాన్ని చాలా అనువాదాల్లో “జైలు అధికారులుగా” అనువదించారు. ఇలా అనువదించడం ద్వారా “బాధించడం”, “నిర్భంధించడం” అనే పదాలకు సంబంధం ఉందని చూపించారు. అలాగే, మత్తయి 8:29, లూకా 8:30, 31 లోని సందర్భాలను పక్కపక్కన పెట్టి చూస్తే, “బాధించడం” ‘పాతాళంతో’ సమానమని చూడగలుగుతాం. పాతాళం అంటే ఏమి చేయలేని స్థితి లేదా మరణం లాంటి సూచనార్థకమైన స్థలం. (రోమీయులు 10:7; ప్రకటన 20:1, 3) నిజానికి, ప్రకటన పుస్తకం చాలాసార్లు “బాధించడం” అనే పదాన్ని సూచనార్థక భావంలో ఉపయోగించింది.—ప్రకటన 9:5; 11:10; 18:7, 10.
-