పాట 130
క్షమిస్తూ ఉండండి
1. ప్రేమతో యెహోవా
చేశాడు ఓ ఏర్పాటు
పాపమరణాల నుండి
కాపాడేలా మనల్ని.
పశ్చాత్తాపాన్ని చూపించి
క్రీస్తుపై విశ్వాసంతో
అడిగితే క్షమాపణ
మన్నిస్తాడు దేవుడు.
2. దేవుని కరుణ
పొందడానికి మనం
క్షమించాలి ఇతరుల్ని
హృదయపూర్వకంగా.
పగ తీర్చుకోకూడదు
చూపించాలి గౌరవం
ప్రేమ మార్గంలో నడుద్దాం
సాటిలేనిదీ మార్గం.
3. కరుణను మనం
అలవర్చుకోవాలి
ద్వేషమనే విషం నుండి
కాపాడుతుంది అదే.
ప్రేమగల యెహోవాను
అనుకరిస్తే మనం
ఎల్లప్పుడు క్షమిస్తుంటాం
దేవునిలాగే ఉంటాం.
(మత్త. 6:12; ఎఫె. 4:32; కొలొ. 3:13 కూడా చూడండి.)