కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • ఈ రోజు

ఆదివారం, సెప్టెంబరు 6

“యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు . . . కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.”—ప్రక. 4:11.

మనం ప్రీచింగ్‌ చేయడానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే మనం యెహోవాను, ఆయన పవిత్రమైన పేరును ప్రేమిస్తాం. మనం ప్రీచింగ్‌ చేస్తే మన ప్రియమైన దేవున్ని స్తుతించినట్టే! తన ఆరాధకుల మహిమ, ఘనత, శక్తిని పొందడానికి యెహోవా అర్హుడని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. యెహోవా ‘అన్నిటినీ సృష్టించాడు’ అని ఒప్పించే రుజువుల్ని ఇతరులకు చెప్పినప్పుడు మనం ఆయనకు మహిమ, ఘనత ఇస్తాం. అలాగే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే అది ఆయనవల్లే కాబట్టి ఆయనకు రుణపడి ఉన్నాం. అంతేకాదు మన సమయాన్ని, బలాన్ని, మనకు ఉన్నవాటన్నిటినీ ఉపయోగించి ప్రీచింగ్‌లో చేయగలిగినదంతా చేస్తూ ఉంటే యెహోవాకు మన శక్తిని ఇస్తాం. (మత్త. 6:33; లూకా 13:24; కొలొ. 3:23) ఒక ముక్కలో చెప్పాలంటే, మనం ప్రేమించే యెహోవా గురించి వేరేవాళ్లకు చెప్పకుండా ఉండలేం. ఆయన పేరు గురించి, దాని అర్థం గురించి కూడా చెప్పాలనే బలమైన కోరిక మనలో ఉంటుంది. w24.05 17 ¶11

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026

సోమవారం, సెప్టెంబరు 7

“తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు.”—హెబ్రీ. 11:6.

యెహోవా ఇప్పుడు మనకు మనశ్శాంతిని, సంతృప్తిని ఇస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో శాశ్వత జీవితం ఇస్తాడు. మనకు ప్రతిఫలం ఇవ్వాలనే కోరిక, శక్తి రెండూ ఆయనకు ఉన్నాయని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఆ నమ్మకంతోనే గతంలో ఉన్న నమ్మకమైన సేవకుల్లాగే మనం కూడా తన సేవలో బిజీగా ఉండవచ్చు. మొదటి శతాబ్దంలో ఉన్న తిమోతి అదే చేశాడు. (హెబ్రీ. 6:10-12) జీవంగల దేవుడు తనకు ప్రతిఫలం ఇస్తాడని తిమోతి గట్టిగా నమ్మాడు. (1 తిమో. 4:10) అందుకే యెహోవా కోసం, ఇతరుల కోసం కష్టపడి పనిచేశాడు. ఏవిధంగా? బోధించే విషయంలో, మాట్లాడే విషయంలో ప్రగతి సాధించాలని అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. అలాగే పిల్లలు, పెద్దవాళ్లు, తోటి ఆరాధకులందరూ తనను చూసి నేర్చుకునేలా ఉండాలని కూడా పౌలు తిమోతికి చెప్పాడు. అంతేకాదు ఆయనకు కొన్ని కష్టమైన పనుల్ని కూడా అప్పగించాడు. దాంట్లో భాగంగా తిమోతి అవసరమైనవాళ్లకు కాస్త గట్టిగానే అయినా ప్రేమగా దిద్దుబాటు ఇవ్వాలి. (1 తిమో. 4:11-16; 2 తిమో. 4:1-5) యెహోవా ప్రతిఫలం ఇస్తాడని తిమోతి నమ్మాడు.—రోమా. 2:6, 7. w24.06 22-23 ¶10-11

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026

మంగళవారం, సెప్టెంబరు 8

“యెహోవా తన ప్రవక్తలందరి ద్వారా . . . ఇశ్రాయేలును, యూదాను హెచ్చరిస్తూ వచ్చాడు.”—2 రాజు. 17:13.

తన ప్రజల్ని హెచ్చరించి, దారిలో పెట్టడానికి యెహోవా ఎప్పటికప్పుడు ప్రవక్తల్ని ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు, యిర్మీయా ద్వారా ఆయనిలా చెప్పాడు: ‘భ్రష్టురాలైన ఇశ్రాయేలూ, తిరిగి రా. నేను విశ్వసనీయుణ్ణి కాబట్టి నీ మీద కోపం చూపించను. నేను ఎల్లప్పుడూ కోపంగా ఉండను. నువ్వు మాత్రం నీ అపరాధాన్ని గుర్తించు, ఎందుకంటే నువ్వు యెహోవాకు ఎదురుతిరిగావు.’ (యిర్మీ. 3:12, 13) యోవేలు ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగిరండి.” (యోవే. 2:12, 13) యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని మీరు కడుక్కొని శుభ్రం చేసుకోండి; మీ దుష్ట పనుల్ని నా కళ్లముందు నుండి తీసేయండి; చెడు చేయడం మానండి.” (యెష. 1:16-19) యెహెజ్కేలు ద్వారా ఇలా అడిగాడు: ‘దుష్టుడు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషమా? అతను తన మార్గాల నుండి పక్కకుమళ్లి, బ్రతకడమే నాకు ఇష్టం. ఏ ఒక్కరైనా చనిపోవడం నాకు అస్సలు ఇష్టంలేదు, కాబట్టి తిరిగొచ్చి బ్రతకండి.’ (యెహె. 18:23, 32) ప్రజలు పశ్చాత్తాపపడితే యెహోవా సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే వాళ్లు శాశ్వతకాలం బ్రతకాలన్నదే ఆయన కోరిక! w24.08 9 ¶5-6

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి