కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “పగటి ఆడ జింక”* అనే రాగంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం.
22 నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?+
నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు?
నా ఆర్తనాదాలు ఎందుకు పట్టించుకోవట్లేదు?+
2 నా దేవా, పగటిపూట నేను నీకు మొరపెడుతూ ఉన్నాను,
కానీ నువ్వు జవాబివ్వడం లేదు;+
రాత్రిపూట కూడా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను.
5 వాళ్లు నీకు మొరపెట్టారు, నువ్వు వాళ్లను కాపాడావు;
6 నా విషయానికొస్తే, మనుషులు నన్ను హీనంగా* చూస్తూ చీదరించుకుంటున్నారు.+
నేను మనిషిని కాదు పురుగును అన్నట్టు చూస్తున్నారు;
8 “అతను యెహోవాకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయనే అతన్ని రక్షించనీ!
అతను ఆయనకు ఎంతో ఇష్టమైనవాడు కాబట్టి ఆయనే అతన్ని కాపాడనీ!”+
9 నా తల్లి గర్భం నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు,+
నా తల్లి స్తనాల మీద నేను సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేశావు.
10 పుట్టినప్పటి నుండి నేను నీ కాపుదలకు అప్పగించబడ్డాను;*
నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నువ్వే నా దేవుడివి.
14 నేను నీళ్లలా పారబోయబడ్డాను;
నా ఎముకలన్నీ వాటి స్థానం తప్పాయి.
15 నాలో ఇక శక్తి లేదు, నేను మట్టి పెంకులా ఉన్నాను;+
నా నాలుక నా అంగిలికి అంటుకుపోతోంది;+
నువ్వు నన్ను మరణ ధూళిలో పడేస్తున్నావు.+
16 నా శత్రువులు కుక్కల్లా నన్ను చుట్టుముట్టారు;+
కీడు చేసేవాళ్ల గుంపు నా మీదికి వస్తోంది,+
వాళ్లు సింహంలా నా చేతులను, కాళ్లను కొరుకుతున్నారు.+
17 నేను నా ఎముకలన్నీ లెక్కపెట్టగలను.+
వాళ్లు నన్ను అదేపనిగా తేరి చూస్తున్నారు.
19 కానీ యెహోవా, నాకు దూరంగా ఉండకు.+
నువ్వే నా బలం; నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+
20 కత్తి నుండి నన్ను,
కుక్కల చేతి* నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని* కాపాడు;+
21 నాకు జవాబివ్వు,
సింహం నోటి నుండి, అడవి ఎద్దుల కొమ్ముల నుండి నన్ను కాపాడు.+
23 యెహోవాకు భయపడేవాళ్లారా, ఆయన్ని స్తుతించండి!
యాకోబు సంతానమా,* మీరంతా ఆయన్ని మహిమపర్చండి!+
ఇశ్రాయేలు సంతానమా,* మీరంతా ఆయన మీద భయభక్తులతో లేచి నిలబడండి.
24 ఆయన బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు;+
అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు.+
అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.+
25 మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను;+
నీకు భయపడేవాళ్ల ముందు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను.
మీరు శాశ్వతకాలం జీవించాలి.*
27 భూమంతా యెహోవాను గుర్తించి, ఆయనవైపు తిరుగుతుంది.
దేశాల కుటుంబాలన్నీ నీ ముందు సాష్టాంగపడతాయి.+
28 ఎందుకంటే రాజరికం యెహోవాది;+
ఆయన దేశాల మీద పరిపాలిస్తున్నాడు.
29 భూమ్మీది ధనవంతులందరూ భోజనం చేసి, మొక్కుతారు;
మట్టికి చేరుకుంటున్న వాళ్లందరూ ఆయన ముందు మోకాళ్లూనుతారు;
వాళ్లలో ఎవ్వరూ తమ ప్రాణాల్ని కాపాడుకోలేరు.
30 వాళ్ల వంశస్థులు ఆయన్ని సేవిస్తారు;
రాబోయే తరం యెహోవా గురించి వింటుంది.
31 వాళ్లు వచ్చి ఆయన నీతి గురించి చెప్తారు.
ఆయన ఏమి చేశాడో పుట్టబోయేవాళ్లకు చెప్తారు.