యెషయా
కల్దీయుల కుమారీ,
సింహాసనం లేని చోట నేలమీద కూర్చో.+
ఎందుకంటే, ప్రజలు ఇంకెప్పుడూ నిన్ను సుకుమారి, గారాలపట్టి అని అనరు.
2 తిరుగలి తీసుకొని పిండి విసురు.
నీ ముసుగు తీసేయి.
నీ కాళ్ల మీద వేలాడుతున్న వస్త్రం పైకెత్తి
నదులు దాటు.
3 నువ్వు దిగంబరిగా చేయబడతావు.
నీకు కలిగే అవమానాన్ని అందరూ చూస్తారు.
నేను పగ తీర్చుకుంటాను,+ నా దారికి ఎవరూ అడ్డురారు.*
6 నా ప్రజల మీద నాకు చాలా కోపమొచ్చింది.+
కానీ నువ్వు వాళ్ల మీద కరుణ చూపించలేదు.+
ముసలివాళ్ల మీద కూడా నువ్వు బరువైన కాడిని మోపావు.+
7 “నేను ఎప్పటికీ దొరసానిగానే* ఉంటాను” అని నువ్వు అనుకున్నావు.+
నువ్వు ఈ విషయాల మీద మనసు పెట్టలేదు;
చివరికి ఏమౌతుందో ఆలోచించలేదు.
సురక్షితంగా కూర్చొని, “నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు.+
నేను విధవరాలిని అవ్వను.
నాకు ఎన్నడూ పుత్రశోకం కలగదు” అని హృదయంలో అనుకుంటున్నదానా,+
ఈ మాటలు విను.
9 వైధవ్యం, పుత్రశోకం రెండూ
అకస్మాత్తుగా, ఒకేరోజు నీకు కలుగుతాయి.+
నువ్వు ఎన్నో మంత్రతంత్రాలు చేస్తున్నావు, శక్తివంతమైన మంత్రాలు పలుకుతున్నావు+ కాబట్టి,*
అవి పూర్తిస్థాయిలో నీ మీదికి వస్తాయి.+
10 నువ్వు నీ దుష్టత్వాన్ని నమ్ముకున్నావు.
“ఎవరూ నన్ను చూడట్లేదు” అనుకున్నావు.
నీ తెలివి, జ్ఞానమే నిన్ను తప్పుదారి పట్టించాయి,
“నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు” అని నీ హృదయంలో అనుకుంటున్నావు.
నీకు పెద్ద కష్టం వస్తుంది; నువ్వు దాన్ని తప్పించుకోలేవు.
నీకెన్నడూ తెలియని నాశనం హఠాత్తుగా నీ మీదికి వస్తుంది.+
అవి నీకు మేలు చేస్తాయేమో;
వాటితో నువ్వు ప్రజల్ని భయపెట్టగలుగుతావేమో.
13 అనేకమంది సలహాదారుల వల్ల నువ్వు అలసిపోయావు.
ఇప్పుడు వాళ్లను లేచి నిన్ను కాపాడమను.
వాళ్లు ఆకాశాన్ని పూజిస్తారు,* నక్షత్రాల్ని గమనిస్తారు,+
నీ మీదికి రాబోయేవాటి గురించిన సంగతుల్ని
అమావాస్య రోజుల్లో నీకు తెలియజేస్తారు.
14 ఇదిగో! వాళ్లు కొయ్యకాలు* లాంటివాళ్లు.
అగ్ని వాళ్లను దహించేస్తుంది.
వాళ్లు అగ్నిజ్వాల శక్తి నుండి తమను తాము కాపాడుకోలేరు.
అవి వెచ్చదనమిచ్చే బొగ్గులు కాదు,
అది చలి కాచుకునే మంట కాదు.
వాళ్లు దారితప్పి, చెదిరిపోయి ఒక్కొక్కరు ఒక్కో వైపు* వెళ్లిపోతారు.
నిన్ను కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+