3 తర్వాత మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “దాస్య గృహమైన ఐగుప్తు నుండి మీరు బయటికి వచ్చిన ఈ రోజును గుర్తుంచుకోండి.+ ఎందుకంటే యెహోవా తన బలమైన చేతితో మిమ్మల్ని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు.+ కాబట్టి మీరు పులిసింది ఏదీ తినకూడదు.
3 నువ్వు దానితోపాటు పులిసిందేదీ తినకూడదు;+ నువ్వు పడిన బాధలకు గుర్తుగా ఉన్న పులవని రొట్టెను నువ్వు ఏడురోజుల పాటు తినాలి, ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశం నుండి హడావిడిగా బయటికి వచ్చావు.+ నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజును నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అలా చేయాలి.+