3 నువ్వు దానితోపాటు పులిసిందేదీ తినకూడదు;+ నువ్వు పడిన బాధలకు గుర్తుగా ఉన్న పులవని రొట్టెను నువ్వు ఏడురోజుల పాటు తినాలి, ఎందుకంటే నువ్వు ఐగుప్తు దేశం నుండి హడావిడిగా బయటికి వచ్చావు.+ నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజును నీ జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అలా చేయాలి.+
7 మీరు కొత్త పిండి అయ్యేలా, పులిసిన పాత పిండిని తీసిపారేయండి. నిజానికి మీరు పులిసిన పిండి లేని కొత్త పిండిలా ఉన్నారు. ఎందుకంటే, క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల బలిగా అర్పించబడ్డాడు.+