కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 22:16-18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 నా శత్రువులు కుక్కల్లా నన్ను చుట్టుముట్టారు;+

      కీడు చేసేవాళ్ల గుంపు నా మీదికి వస్తోంది,+

      వాళ్లు సింహంలా నా చేతులను, కాళ్లను కొరుకుతున్నారు.+

      17 నేను నా ఎముకలన్నీ లెక్కపెట్టగలను.+

      వాళ్లు నన్ను అదేపనిగా తేరి చూస్తున్నారు.

      18 వాళ్లు నా వస్త్రాలు పంచుకుంటున్నారు,

      నా వస్త్రాల కోసం చీట్లు* వేసుకుంటున్నారు.+

  • యెషయా 53:1-12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 53 మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+

      యెహోవా బాహువు ఎవరికి వెల్లడైంది?+

       2 చిగురులా,+ ఎండిన దేశంలో వేరులా ఆయన అతని* ముందు పైకివస్తాడు.

      ఆయనకు చూడచక్కని రూపం గానీ, వైభవం గానీ లేవు;+

      ఆయన్ని చూసినప్పుడు, ఆయన రూపం మనల్ని ఆకట్టుకోదు.*

       3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+

      నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు.

      ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.*

      ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+

       4 నిజంగా, ఆయన మన రోగాల్ని మోశాడు,+

      మన నొప్పుల్ని భరించాడు,+

      మనం మాత్రం ఆయన్ని అంటువ్యాధి వచ్చినవాడిలా, దేవుడు శిక్షించి బాధపెట్టిన వ్యక్తిలా చూశాం.

       5 నిజానికి ఆయన మన దోషాల వల్ల+ పొడవబడ్డాడు;+

      మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.+

      మనం నెమ్మదితో ఉండాలని ఆయన శిక్ష అనుభవించాడు,+

      ఆయన గాయాల వల్ల మనం బాగయ్యాం.+

       6 మనందరం గొర్రెల్లా దారితప్పి తిరిగాం,+

      ప్రతీ ఒక్కరం నచ్చిన దారిలో వెళ్లిపోయాం,

      అయితే యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు.+

       7 ఆయన అణచివేయబడ్డాడు,+ కష్టాలన్నీ భరించాడు,+

      అయినా ఆయన నోరు తెరవలేదు.

      వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు,+

      బొచ్చు కత్తిరించే వాళ్లముందు ఆడగొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు,

      ఆయన నోరు తెరవలేదు.+

       8 అన్యాయపు తీర్పు తీర్చి* ఆయన్ని తీసుకెళ్లిపోయారు;

      ఆయన తరానికి* సంబంధించిన వివరాల గురించి ఎవరు ఆలోచిస్తారు?

      ఎందుకంటే సజీవుల దేశం నుండి ఆయన కొట్టివేయబడ్డాడు;+

      నా ప్రజల దోషం వల్ల ఆయన కొట్టబడ్డాడు.*+

       9 ఆయన ఏ తప్పూ* చేయకపోయినా,

      ఆయన నోట ఎలాంటి మోసం లేకపోయినా,+

      ఆయన చనిపోయినప్పుడు దుష్టులతో పాటు ఆయన్ని సమాధి చేశారు,*+

      ఆయన ధనవంతుల* దగ్గర సమాధి చేయబడ్డాడు.+

      10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*

      నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+

      ఆయన తన సంతానాన్ని* చూస్తాడు, ఆయన ఆయుష్షు పెరుగుతుంది,+

      ఆయన ద్వారా యెహోవా ఇష్టం* నెరవేరుతుంది.+

      11 ఆయన తాను అనుభవించిన వేదన వల్ల, తాను చూసినదాన్ని బట్టి సంతృప్తి పొందుతాడు.

      నీతిమంతుడు, అంటే నా సేవకుడు తన జ్ఞానం వల్ల,

      చాలామంది నీతిమంతులయ్యేలా సహాయం చేస్తాడు,+

      వాళ్ల తప్పుల్ని భరిస్తాడు.+

      12 అందుకే, చాలామందితో పాటు నేను ఆయనకు భాగం నియమిస్తాను,

      బలశాలులతో పాటు ఆయన దోపుడుసొమ్ము పంచుకుంటాడు;

      ఎందుకంటే, ఆయన తన ప్రాణాన్ని ధారపోసి, చివరికి చనిపోయాడు,+

      దోషుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు;+

      ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు,+

      దోషుల తరఫున వేడుకున్నాడు.+

  • దానియేలు 9:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 “ఆ 62 వారాల తర్వాత, తనకంటూ ఏమీ లేకుండా+ మెస్సీయ చంపబడతాడు.*+

      “నగరాన్ని, పవిత్ర స్థలాన్ని రాబోయే సైన్యాలు నాశనం చేస్తాయి.+ వరదతో దాని అంతం వస్తుంది. అంతం వరకు యుద్ధం జరుగుతుంది; నాశనం జరగాలని దేవుడు నిర్ణయించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి