-
యెషయా 9:1, 2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 కానీ ఆ అంధకారం, దేశం మీదికి కష్టం వచ్చినప్పటి అంధకారంలా ఉండదు; అంటే జెబూలూను దేశం, నఫ్తాలి దేశం నీచంగా చూడబడినప్పటి+ అంధకారంలా ఉండదు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన దానికి, అంటే సముద్రం వైపున్న మార్గాన యొర్దాను ప్రాంతంలో ఉన్న అన్యజనుల గలిలయకు ఘనతను కలగజేస్తాడు.
2 చీకట్లో నడుస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూశారు.
గాఢాంధకారంలో నివసించే ప్రజల మీద
వెలుగు ప్రకాశించింది.+
-