కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 14:1-5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఆ కాలంలో గలిలయ ప్రాంత పరిపాలకుడైన* హేరోదు యేసు గురించి విని,+ 2 తన సేవకులతో ఇలా అన్నాడు: “అతను బాప్తిస్మమిచ్చే యోహానే. అతను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు, అందుకే అతను ఈ శక్తివంతమైన పనుల్ని చేయగలుగుతున్నాడు.”+ 3 హేరోదు* తన అన్న ఫిలిప్పు భార్యయైన హేరోదియ కారణంగా యోహానును బంధించి, చెరసాలలో వేయించాడు.+ 4 ఎందుకంటే యోహాను అతనితో, “నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవడం తప్పు”+ అని అంటూ ఉండేవాడు. 5 హేరోదు యోహానును చంపాలనుకున్నాడు, కానీ ప్రజలు యోహానును ప్రవక్తగా చూస్తున్నందువల్ల హేరోదు వాళ్లకు భయపడ్డాడు.+

  • లూకా 9:7-9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 గలిలయ ప్రాంత పరిపాలకుడైన* హేరోదు* జరుగుతున్న వాటన్నిటి గురించి విని, చాలా కంగారుపడ్డాడు. ఎందుకంటే, యోహాను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని కొంతమంది చెప్పుకుంటున్నారు.+ 8 అయితే ఇంకొంతమంది ఏలీయా మళ్లీ వచ్చాడని, మరికొంతమంది ప్రాచీన ప్రవక్తల్లో ఒకరు మళ్లీ బ్రతికారని చెప్పుకుంటున్నారు.+ 9 హేరోదు ఇలా అన్నాడు: “నేను యోహాను తలను నరికించాను కదా.+ మరి ఈయన ఎవరు? ఈయన గురించి నేను రకరకాల విషయాలు వింటున్నాను.” కాబట్టి హేరోదు ఆయన్ని చూడాలని ఎంతో కోరుకున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి