-
మార్కు 6:14-16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 యేసు పేరుప్రఖ్యాతులు అంతటా వ్యాపించడంతో, ఆ వార్త హేరోదు రాజు చెవిన కూడా పడింది. ప్రజలు ఆయన గురించి, “బాప్తిస్మమిచ్చే యోహాను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు, అందుకే ఆయన శక్తివంతమైన పనులు చేయగలుగుతున్నాడు” అని చెప్పుకుంటున్నారు.+ 15 అయితే కొందరు “ఈయన ఏలీయా” అనీ, ఇంకొందరు “ప్రాచీనకాల ప్రవక్తల్లాగే ఒక ప్రవక్త” అనీ అన్నారు.+ 16 కానీ హేరోదు యేసు గురించి విన్నప్పుడు, “నేను తల నరికించిన యోహానే మళ్లీ బ్రతికాడు” అని అన్నాడు.
-