-
మార్కు 1:23-25పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 ఆ సమయంలో, అపవిత్ర దూత* పట్టిన ఒకతను ఆ సమాజమందిరంలో ఉన్నాడు, అతను ఇలా అరిచాడు: 24 “నజరేయుడివైన యేసూ, మాతో నీకేం పని?+ మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పవిత్రుడివి!”+ 25 అప్పుడు యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకుండా అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు.
-
-
లూకా 4:34, 35పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
34 “నజరేయుడివైన యేసూ,+ మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పవిత్రుడివి!”+ 35 అయితే యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకుండా అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు. దాంతో ఆ అపవిత్ర దూత అతన్ని వాళ్ల మధ్య కింద పడేసి, అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేశాడు.
-