27తెల్లవారినప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు అందరూ కలుసుకొని యేసును చంపడం గురించి చర్చించుకున్నారు.+2 వాళ్లు ఆయన చేతులు కట్టేసి, తీసుకెళ్లి అధిపతైన పిలాతుకు అప్పగించారు.+
28 అప్పుడు వాళ్లు యేసును కయప ఇంటి నుండి అధిపతి భవనానికి తీసుకెళ్లారు.+ అప్పటికి తెల్లవారింది. అయితే యూదులు మాత్రం అధిపతి భవనం లోపలికి వెళ్లలేదు, ఎందుకంటే వాళ్లు పస్కా భోజనాన్ని తినగలిగేలా అపవిత్రులు కాకూడదని+ అనుకున్నారు.
13 మన పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు+ తన సేవకుడైన+ యేసును మహిమపర్చాడు.+ ఆ యేసును మీరు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినా మీరు ఆయన్ని వద్దనుకున్నారు.