-
మత్తయి 27:11-14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 యేసు ఇప్పుడు పిలాతు ముందు నిలబడ్డాడు. అతను యేసును, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు.+ 12 అయితే ముఖ్య యాజకులు, పెద్దలు తన మీద నిందలు వేస్తున్నప్పుడు యేసు ఏమీ మాట్లాడలేదు.+ 13 అప్పుడు పిలాతు యేసును, “నీ మీద వాళ్లు ఎన్నెన్ని నిందలు వేస్తున్నారో నీకు వినబడట్లేదా?” అన్నాడు. 14 అప్పుడు కూడా యేసు ఒక్కమాటైనా మాట్లాడలేదు, దాంతో పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు.
-